Dunki Review: డంకీ ప్రీమియర్ టాక్: షారుఖ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్, సినిమాకు హైలెట్ అదే!

First Published Dec 21, 2023, 7:07 AM IST

దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ, షారుఖ్ ఖాన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం డంకీ. డిసెంబర్ 21న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ ముగియగా టాక్ ఎలా ఉందో చూద్దాం... 
 

అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్నారు రాజ్ కుమార్ హిరాణీ. సోషల్ సబ్జక్ట్స్ కి ఎమోషన్, హ్యూమర్ జోడించి చెప్పడం ఆయన స్టైల్. మున్నాభాయ్ ఎం బి బి ఎస్, త్రీ ఇడియట్స్, పీకే  వంటి చిత్రాలు సందేశాత్మకంగా తెరకెక్కాయి. రాజ్ కుమార్ హిరాణీ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 
 

ఫస్ట్ టైం రాజ్ కుమార్ హీరో షారుఖ్ ఖాన్ తో మూవీ చేశారు. మాస్ హీరో అయినప్పటికీ షారుఖ్ తో కూడా ఆయన సోషల్ సబ్జెక్టు చేశారు. డంకీ టైటిల్ చాలా ఆసక్తి రేపింది. ఇక ట్రైలర్, టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రోమోలు చూశాక డంకీ మెక్సికన్ ఫైనల్ డెసర్టో రీమేక్ అని ప్రచారం జరిగింది. అధికారికంగా యూనిట్ ప్రకటించింది లేదు. 

ఇది ఐదుగురు మిత్రుల కథ. విదేశాలకు వెళ్లాలంటే దండిగా డబ్బు ఉండాలి. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడాలి. లండన్ వెళ్లాలని కలగనే ఈ ఫైవ్ ఫ్రెండ్స్ కి ఇంగ్లీష్ రాదు. డబ్బులు లేవు. ఎలాగైనా లండన్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. సక్రమ మార్గంలో ప్రయత్నించి విసిగిపోతాడు. 


అప్పుడు అక్రమ మార్గం ఎంచుకుంటారు. దొంగతనంగా లండన్ కి వెళ్లాలి అనుకుంటారు. మరి వారి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యింది? ఈ ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి? అసలు వాళ్ళు లండన్ కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు? అనేది అసలు కథ... 
 

డంకీ చిత్ర ప్రీమియర్ టాక్ చూస్తే.. రాజ్ కుమార్ హిరాణీ మార్క్ స్టోరీ టెల్లింగ్, డైరెక్షన్ ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. ఎమోషన్, సస్పెన్సు, హ్యూమర్ ప్రధానంగా మూవీ సాగుతుంది. సామాజిక అంశం ప్రేక్షకులకు కదిలించేదిగా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తించేలా సినిమా సాగుతుంది. ఆ విషయంలో రాజ్ కుమార్ హిరాణీ  సక్సెస్ అయ్యారు. 

ఇక షారుఖ్ నటన అద్భుతం. మాస్ కమర్షియల్ రోల్స్ కి భిన్నంగా ఒక ఎమోషనల్ రోల్ చేశాడు. ఆయన పాత్రలోని షేడ్స్ ఆకట్టుకుంటాయి. తాప్సి, విక్కీ కౌశల్ నటన మెప్పిస్తుంది. బోమన్ ఇరానీ మరోసారి అద్భుతం చేశాడు.. 


డంకీ మూవీతో షారుఖ్ ఖాన్ మరో బ్లాక్ బస్టర్ నమోదు చేశాడని ప్రేక్షకుల అభిప్రాయం.  ఇదే విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా ఆద్యంతం అలరించేలా సినిమా సాగిందని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 

మొత్తంగా డంకీ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ప్రేక్షకులు సినిమా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. డంకీ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సలార్ మూవీతో తలపడుతుంది. మరి ఈ రెండు చిత్రాల్లో విన్నర్ ఎవరో చూడాలి... 
 

click me!