Dunki Review:డంకీ ట్విట్టర్ రివ్యూ, షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టేనా..?

First Published | Dec 21, 2023, 6:04 AM IST

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, స్టార్ సీనియర్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబోలో తెరకెక్కిన అద్భుతం డంకీ.  ఈమూవీపై బాలీవుడ్ తో సహా దేశం అంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తోంది.  తాప్పీ పొన్ను, వికీ కౌశల్ లాంటి మరికొంతమంది స్టార్స్ అంతా కలిసి నటించిన ఈసినిమా ఈరోజు (డిసెంబర్ 21) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది. మరి ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారాతెలియజేస్తున్నారు. వారు ఏమంటున్నారంటే..? 
 

దాదాపు 5 ఏళ్లు గ్యాప్ ఇచ్చి... ఫోర్స్ గా కంమ్ బ్యాక్ ఇచ్చాడు బాలీవుడ్ బాద్షా.. షారుఖ్ ఖాన్.  రీ ఎంట్రీలో చేసిన రెండు సినిమాలు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ను సాధించి షారుఖ్ ఖాన్ ను గట్టిగా నిలబెట్టాయి. అంతే కాదు. కంప్లీట్ గా నిద్రపోతున్నబాలీవుడ్ ను పైకి లేపి తలెత్తుకునేలా చేశాయి షారుఖ్ ఖాన్ సినిమాలు. ఈక్రమంలో ఆయన ముచ్చటగా మూడో సినిమా డంకీ కూడా వెయ్యి కోట్ల మార్క్ దాటుతుంది అని నమ్మకంతో ఉన్నారు. మరి డంకీ సినిమా గురించి ట్విట్టర్  ఆడియన్స్ ఏమంటున్నారంటే..? 
 

డంకీ మూవీ అంద్భుతం అంటున్నారు ట్విట్టర్ జనాలు. మరీ ముఖ్యంగా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ టేకింగ్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సినిమాను అద్భుతంగా డ్రైవ్ చేశారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాదు ఆర్టిస్ట్ ల నుంచి తనకు కావల్సింది పర్ఫెక్ట్ గా తీసుకోగల దర్శకుడు రాజ్ కుమార్ అంటూ.. తెగపొగిడేస్తున్నారు.


డంకీ సినిమా ఆడియన్స్ కు సరికొత్త  కొత్త అనుభూతి కలిగించాడన్నారు మరో నెటిజన్. ఈసినిమా పక్కా  బ్లాక్ బస్టర్ అంటున్నాడు. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి మాస్టర్ పీస్ తీయడమే కాకుండా 

ఇక షారుఖ్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు షారుఖ్ ఖాన్. కథ అద్భుతంగా ఉంది.. కథను దర్శకుడు ఇంకా అద్భుతంగా తెరకెక్కించాడంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు మరో నెటిజన్ అయితే.. ఈసినిమా ప్లాప్అయితే.. నా ట్విట్టర్ అకౌంట్ డిలేట్ చేస్తానంటూ బెట్ వేశాడు. 

ఇక డంకీ సినిమా స్టార్ట్ అయిన అప్పటి నుంచి చివరివరకూ.. అద్భుతంగా ఉందన్నారు మరో నెటిజన్. సినిమా అయిపోయే వరకూ సీట్లకు అతుక్కు పోయాం.. షారుఖ్ తో సహా నటీనటులంతా అద్భుతం చేశారు. ఇక రాజ్ కుమార్ మ్యాజిక్ బాగా పనిచేసింది అన్నారు. 

ఇక ఈసినిమాలో నటించిన అందరు అద్భుతం చేశారన్నారు నెటిజన్. షారుఖ్ తో పాటు వికీ కౌశల్, తాప్సీ నటనకు ఫిదా అవ్వాల్సిందే.. ముఖ్యంగా  ఎమోషన్స్ , మెలోడిని మిక్స్ చేసి నడిపించిన కథ అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు. అంతే కాదు సినిమా ప్రియులు ఎవరూ డంకీని మిస్ చేసుకోవద్దుఅన్నారు. 
 

ఇక డంకీ మూవీ అద్భుతంగా ఉంది.. రాజ్ కుమార్ హీరాణీ గతసినిమాలకంటే ఇది ఇంకా బాగుంటుంది,  పఠాన్, జవాన్ సినిమాల కంటే షారుఖ్ ఖాన్ కు ఇది అతి పెద్ద విజయం అన్నారు మరో నెటిజన్. అంతే కాదు ఈమూవీ 1000 కోట్లు సాధించడం పెద్ద విషయం కాదు.  అంతకంటే ఎక్కువ టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఉండాలి అంటూ ట్వీట్ చేశారు. 
 

ఇలా వరుసగా ట్వీట్స్ అన్నీ ఈసినిమాకు పాజిటీవ్ గానే ఉన్నాయి. నెగెటీవ్ రివ్యూస్ ఎక్కడా కనిపించలేదు. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యిసూపర్ హిట్ కొట్టడమే కాదు.. పఠాన్, జవాన్ సినిమాల రికార్డ్ లను కూడా బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు సినిమా జనాలు. ఈ క్రమంలో డంకీతో షారుఖ్ హ్యాట్రిక్ హిట్ ఎలా ఉంటుందో చూడాలి. 

Latest Videos

click me!