Pathaan Movie Review: పఠాన్ మూవీ ప్రీమియర్ టాక్... యాక్షన్ మూవీ లవర్స్ కి విజువల్ ట్రీట్!

Published : Jan 25, 2023, 08:55 AM ISTUpdated : Jan 25, 2023, 09:04 AM IST

షారుక్ ఖాన్-దీపికా పదుకొనె జంటగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్. జనవరి 25న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల చేశారు. ప్రీమియర్స్ ప్రదర్శన ముగిసిన నేపథ్యంలో... టాక్ బయటకు వచ్చింది.   

PREV
18
Pathaan Movie Review: పఠాన్ మూవీ ప్రీమియర్ టాక్... యాక్షన్ మూవీ లవర్స్ కి విజువల్ ట్రీట్!
Pathaan Movie Review


హీరోగా షారుఖ్ భారీ స్టార్డం అనుభవించారు. రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్ ని ఏలారు. ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్స్ నెలకొల్పి బాద్షా అయ్యాడు. అలాంటి షారుక్ కి గడ్డుకాలం ఎదురైంది. పదేళ్లుగా ఆయనకు సరైన హిట్ లేదు. ఈ క్రమంలో అనేక ప్రయోగాలు చేశారు. ఏదీ ఫలితం ఇవ్వలేదు. దీంతో ఏకంగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం జీరో 2018లో విడుదలైంది. 

28
Pathaan Movie Review

కసిగా పఠాన్ మూవీ చేశారు. పఠాన్ ప్రోమోలు సినిమా మీద అంచనాలు పెంచాయి. ముఖ్యంగా యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ షారుక్ అభిమానులకు గూస్ బంప్స్ కలిగించింది. సిద్ధార్థ్ ఆనంద్ ఆడియన్స్ కోసం భారీ విజువల్ ట్రీట్ సిద్ధం చేశారన్న అభిప్రాయానికి వచ్చారు. ఆయన గత చిత్రం వార్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం కూడా హైప్ కి కారణమైంది. 
 

38
Pathaan Movie Review

నేడు తెల్లవారుజాము నుండి ఓవర్సీస్ తో పాటు ఇండియాలో ప్రీమియర్స్ ప్రదర్శన జరుగుతుంది. మూవీ చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. అనేక వివాదాల మధ్య విడుదలైన పఠాన్ ప్రీమియర్ టాక్(Pathaan Movie Review) పాజిటివ్ గానే ఉంది. 
 

48
Pathaan Movie Review

పఠాన్ మూవీ కథ విషయానికి వస్తే... భారత్ ని దెబ్బతీయాలని శత్రు దేశాలు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే డేంజరస్ టెర్రర్ గ్రూప్ టార్గెట్ ఇండియా అవుతుంది. డబ్బులు తీసుకొని దేశాలపై అటాక్స్ ప్లాన్ చేసే ఆ టెర్రర్ ఆర్గనైజేషన్ భారత్ కి స్పాట్ పెడుతుంది. ఈ అటాక్ ని ఆపేందుకు ఇండియాకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ పఠాన్(షారుక్ ఖాన్). అజ్ఞాతంలో ఉన్న ఏజెంట్ పఠాన్ ని రంగంలోకి దింపుతారు. బలమైన ప్రత్యర్థి జాన్ అబ్రహం ని పఠాన్ ఎలా ఎదుర్కొన్నారు? దేశాన్ని ఎలా కాపాడాడు? అనేది కథ. 
 

58
Pathaan Movie Review


కథ చాలా సింపుల్. కానీ ఇక్కడ విజువల్స్, ట్విస్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కీలకం. పఠాన్ చిత్రానికి యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన బలం. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, భారీ ఛేజింగ్స్ ఆకట్టుకుంటాయి. రిచ్ లొకేషన్స్ కట్టిపడేస్తాయి. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్ కి ఏమాత్రం తగ్గని రేంజ్ లో పఠాన్ చిత్రం ఉంది అంటున్నారు. 
 

68
Pathaan Movie Review


షారుక్ స్క్రీన్ ప్రెజెన్స్ బిగ్ ట్రీట్ అనేది ఆడియన్స్ అభిప్రాయం. హిట్ కొట్టాలన్న కసి ఆయనలో కనిపించింది. వెల్ టోన్డ్ బాడీలో షారుక్ యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ కలిగిస్తాయి. డేంజరస్ స్ట్రాంగ్ విలన్ రోల్ లో జాన్ అబ్రహం ఆకట్టుకున్నారు. షారుక్-జాన్ అబ్రహం మధ్య హోరాహోరీ సన్నివేశాలు సినిమా హైలెట్స్ లో ఒకటి. 

78
Pathaan Movie Review

దీపికా గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీపికా ఇతర ఇండియన్ హీరోయిన్స్ కంటే ఎందుకు ప్రత్యేకమో పఠాన్ మూవీ చూస్తే తెలుస్తుంది. ఆమె పద్మావత్ వంటి పీరియాడిక్ పాత్రలో ట్రెడిషనల్ గా ఆకట్టుకోగలరు అదే సమయంలో హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్ మాదిరి ఆల్ట్రా స్టైలిష్ లుక్ ట్రై చేయగలరు. కీలక రోల్ లో దీపికా చించేశారని ఆడియన్స్ అభిప్రాయం.

88
Pathaan Movie Review

సినిమా నిర్మాణ విలువలు టాప్ లెవెల్ లో ఉన్నాయి. మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే గుడ్ అంటున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ సైతం మెప్పించాయి అంటున్నారు. మొత్తంగా పఠాన్ మూవీతో క్లీన్ బ్లాక్ బస్టర్ షారుక్ ఖాతాలో పడిందనేది ప్రీమియర్ టాక్. 

click me!

Recommended Stories