ఓనెటిజన్ కు చుక్కలు చూపించింది బాలీవుడ్ బాద్ షా..షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్. తన పర్సనల్ విషయాల గురించి షాకింగ్ క్వాశ్చన్ వేసిన నెటిజన్ కు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది బ్యూటీ. ఇంతకీ ఏమంటుందంటే...?
షారుఖ్ ఖాన్ గురించి.. ఆయన ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ డమ్ తో పాటు... సోషల్ మీడియా ఇమేజ్ కూడా సాధించారు షారుఖ్ పిల్లలు. పలు విషయాలలో ఎప్పటికప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వార్తల్లో నిలిచారు.
26
suhana khan
హీరోయిన్లను మించిన ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంటుంది సుహానా ఖాన్. ఆమె అందంతో నెట్టింట్ట రచ్చ చేస్తుంది. పలు కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేస్తుంటుంది బ్యూటీ. తన పై ట్రోల్ చేసేవారికి కూడా అంతే స్రాంగ్ గా సమాధానం చెపుతుంటుంది. అయితే ఈక్రమంలో ఆమె తాజాగా ఓ నెటిజన్ కు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
36
sha rukh khan and suhana khan
సుహానా ఖాన్ కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. స్టార్ కిడ్ గా ఆమె ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో సుహానా చాలా యాక్టివ్ గా ఉంటుంది. మరోవైపు ఆమె తెరంగేట్రం చేసిన 'ది ఆర్చీస్' డిసెంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సుహానా పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటోంది.
46
తాజగా 'వోగ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. ఇతర అమ్మాయిలతో మీ బోయ్ ఫ్రెండ్ డేటింగ్ చేయడం, మిమ్మల్ని మోసం చేయడం వంటి వాటిని మీరు గుర్తిస్తే ఏం చేస్తారని ఆమెను ప్రశ్నించారు. దాంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు ప్రశ్నకే షాక్ అయితే ఆమె చెప్పిన సమాధానానికి ఇంకా షాక్ అవుతారు.
56
ఈ ప్రశ్నకు సుహానా స్పందిస్తూ... ఏమత్రం తడుముకోకుండా.. అతన్ని వదిలేస్తానని డైరెక్ట్ గా చెప్పేసింది. కేవలం ఒక అమ్మాయిని మాత్రమే ప్రేమించే వ్యక్తిని మాత్రమే తాను ఇష్టపడతానని తెలిపింది.
66
ది ఆర్చీస్'లో సుహానాతో పాటు ఖుషి కపూర్, అగస్త్య నంద, మిహిర్ అహూజా, సింగర్ ఆదితి సైగల్, వేదాంగ్ రైనా తదితరులు నటించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. షారుఖ్ తనయ కావడంతో.. ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ గట్టిగా ఉన్నట్టు తెలుస్తోందతి.