అంబానీ పెళ్లి లో డాన్స్, ఖాన్ త్రయం తో పాటు ఫిల్మ్ స్టార్స్ కు ఎన్ని కోట్లు ఇచ్చారంటే..?

Published : Mar 07, 2024, 12:20 PM ISTUpdated : Mar 07, 2024, 12:31 PM IST

ప్రపంచం నివ్వెరపోయేలా జరిగాయి అంబాని ఇంట ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం పాల్గొంది  అంతే కాదు.. వారికి కోట్లకు కోట్లు రెమ్యూరేషన్ కూడా ముట్టినట్టు తెలుస్తోంది.   

PREV
18
అంబానీ పెళ్లి లో డాన్స్, ఖాన్ త్రయం తో పాటు ఫిల్మ్ స్టార్స్ కు ఎన్ని కోట్లు ఇచ్చారంటే..?

దిగ్గజ వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్‌లోని జామ్ నగర్ లో  ఘనంగా జరిగింది.
 

28
Anant Ambani Pre Wedding

మార్చి 1 నుంచి 3 వరకు వందల కోట్లు ఖర్చు పెట్టి  జరిగిన ఈ మెగా ఈవెంట్ లో భారతీయ సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆనంద్ అంబానీ వేల కోట్లు ఖర్చు చేసిన  ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా  చర్చనీయాంశంగా మారింది. 
 

38
Why did Rihanna leave Ambani’s wedding early

ఈ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్స్ డాన్స్ తో పాటు.. ఆనంద్-రాధికల సంగీత ప్రదర్శన హైలైట్ అని చెప్పొచ్చు. ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా నృత్యం, ముఖేష్-నీతా అంబానీల మెడ్లీ, ఆనంద్-రాధికల రొమాంటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. 
 

48

ఈ ఆవెంట్లు ముగిసి మూడు రోజులు పైనే అవుతున్నా.. వాటి గురించి ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే.. ఎంత అద్భుతంగా ఈ ఆఈవెంట్స్ ను నిర్వహించారో అర్ధం అవుతోంది. ఇక ఇప్పటికీ ఈ ఈవెంట్ గురించి చిత్ర విచిత్రమైన వార్తలు వస్తూనే ఉన్నాయి.  ముఖ్యంగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఈ ఈవెంట్‌లో పాల్గొనడంతో 3 రోజులు అట్టమ్ బాటమ్ వేడుకగా జరుపుకున్నారు.

58
Anant Ambani Radhika Merchant Pre Wedding

ఇక అంబాని ప్యామిలీ ఈవెంట్స్ తో పాటు.. బాలీవుడ్ స్టార్స్ కూడా వేధికపై డాన్స్ చేస్తూ.. సందడి చేశారు. దేశ మంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూసిన ఈ ఈవెంట్స్ లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా వేదికపైకి డ్యాన్స్ చేశారు. ఇందుకు గాను వారికి కోట్లలో డబ్బులు ఇచ్చారని సమాచారం.
 

68
Anant Ambani Radhika Merchant Pre Wedding

అందుకు తగ్గట్టుగానే కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ జంట డ్యాన్స్ చేసేందుకు వారికి 3 కోట్లు చెల్లించారట. అంతే కాదు బాలీవుడ్ మరో స్టార్ కపుల్స్  రణవీర్ సింగ్-దీపికా పదుకొనే జంటకు కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు నటుడు అక్షయ్‌కుమార్‌కు రూ.1.5 కోట్లు, ఒక్క డ్యాన్స్‌కే రూ.3.5 కోట్లు చెల్లించారట. 
 

78

అంతే కాదు బాలీవుడ్ కింగ్.. బాద్ షా...  షారుఖ్ ఖాన్ కు డాన్స్ కోసమే 3 కోట్లు సమర్పించుకున్నారట. అదేవిధంగా సల్మాన్ ఖాన్ పాల్గొనేందుకు 2 కోట్లు, ఒక్క డాన్స్ కోసమే రూ.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మరి ఈ విషయంలో నిజానిజాలు ఎమిటో తెలియదు కాని.. బాలీవుడ్ స్టార్స మాత్రం అంబాని దగ్గర గట్టిగా లాగారనితెలుస్తోంది.  
 

88

అంతే కాదు బాలీవుడ్ కింగ్.. బాద్ షా...  షారుఖ్ ఖాన్ కు డాన్స్ కోసమే 3 కోట్లు సమర్పించుకున్నారట. అదేవిధంగా సల్మాన్ ఖాన్ పాల్గొనేందుకు 2 కోట్లు, ఒక్క డాన్స్ కోసమే రూ.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మరి ఈ విషయంలో నిజానిజాలు ఎమిటో తెలియదు కాని.. బాలీవుడ్ స్టార్స మాత్రం అంబాని దగ్గర గట్టిగా లాగారనితెలుస్తోంది.  
 

click me!

Recommended Stories