ముక్కుపుడకతో మతిపోగొడుతున్న అనుపమా పరమేశ్వరన్‌.. `ఈగల్‌` ఈవెంట్‌లో హల్‌చల్‌ చేసిన హోమ్లీ బ్యూటీ..

Published : Dec 20, 2023, 10:15 PM IST

హోమ్లీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌.. `ప్రేమమ్‌` తో తెలుగు ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించింది.   

PREV
110
ముక్కుపుడకతో మతిపోగొడుతున్న అనుపమా పరమేశ్వరన్‌.. `ఈగల్‌` ఈవెంట్‌లో హల్‌చల్‌ చేసిన హోమ్లీ బ్యూటీ..

అనుపమా పరమేశ్వరన్‌.. తాజాగా `ఈగల్‌` ఈవెంట్‌లో మెరిసింది. రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ ఈవెంట్‌ ఈ రోజుసాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో సందడి చేసింది అనుపమా. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 
 

210

అయితే బ్లాక్‌ జాలీలాంటి డ్రెస్‌ వేసి సూపర్‌ స్టయిలీష్‌గా ఉంది అనుపమా పరమేశ్వరన్‌. అంతేకాదు ఆమె ముక్కు పుడక ధరించడం హైలైట్‌గా నిలిచింది. ఇందులో ఆమె సరికొత్తగా ఉంది. కట్టిపడేస్తుంది. 
 

310

అనుపమా లేటెస్ట్ లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. `ఈగల్‌` ఈవెంట్‌లోనే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది అనుపమా పరమేశ్వరన్‌. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది. 

410

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, `ఈగల్‌` చిత్రంలో నటించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. రవితేజతో అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ అని చెప్పింది. అయితే ఎప్పుడో చాలా రోజుల క్రితమే ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చి, మిస్‌ అయినట్టు చెప్పింది. 

510

రవితేజతో కలిసి నటించాలనేది తన డ్రీమ్‌ అని, ఇన్నాళ్లకి కుదిరిందని పేర్కొంది. అలాగే సినిమా అద్భుతంగా ఉంటుందని, దర్శకుడు చాలా బాగా చేశాడని, ఈ సినిమా కోసం తాను వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పింది. కావ్య థాపర్‌తో తనకు స్క్రీన్‌ లేదని వెల్లడించింది. 
 

610

ఈవెంట్‌లో ఆడియెన్స్ తో సరదాగా మాట్లాడింది. కూర్చున్నప్పుడు బెండకాయ, దొండకాయ అన్నారు, ఇప్పుడు ఏమీ అనరా అంటూ సరదాగా మాట్లాడింది. సందడి చేసి మెప్పించింది. తనని ప్రేమిస్తున్నట్టుగానే సినిమాని ఆదరించాలని చెప్పింది. 
 

710

రవితేజ హీరోగా రూపొందుతున్న `ఈగల్‌` చిత్రంలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్రలో కనిపించబోతుంది.
 

810

శ్రీనివాస్‌ అవసరాల, నవదీప్‌ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ రిలీజ్‌ కాబోతుంది. 

910

ఇక అనుపమా పరమేశ్వరన్‌ తెలుగులో మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అందులో `టిల్లుస్వ్కైర్‌` ప్రధానంగా ఉంది. సిద్దు జొన్నలగడ్డ హీరో. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్‌ కాబోతుంది. దీంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ సందడి చేయబోతుంది అనుపమా. 

1010

అనుపమా పరమేశ్వరన్‌ ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా ఉండేది. ఇప్పుడు గ్లామర్‌ బ్యూటీగా మారుతుంది. స్కిన్‌ షో చేస్తూ మెప్పిస్తుంది. లిప్‌ లాక్‌లకు ఓకే చెబుతుంది. కమర్షియల్‌ ట్రాక్‌లో పడి దూసుకుపోతుంది. అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది అనుపమా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories