Dunki Collections : 17 రోజుల్లో ‘డంకీ’ కలెక్షన్స్ ఎంతో తెలుసా? ఇంకా ఆ మార్క్ దాటలేదే!

First Published Jan 8, 2024, 1:26 PM IST

షారుఖ్ ఖాన్ ‘డంకీ’ చిత్రం థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతోంది. కానీ ఈ చిత్రం 17 రోజుల కలెక్షన్స్ మాత్రం కింగ్ ఖాన్ గత చిత్రాలతో పోల్చితే చాలా పూర్ గా కనిపిస్తున్నాయి. 

 బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ - స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) కాంబోలో వచ్చిన చిత్రం ‘డంకీ’ (Dunki). ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఎన్నో అంచనాలతో థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. కానీ ఈ చిత్రం అంచనాలను తగ్గట్టుగా లేదనీ కూడా ఆడియెన్స్ నుంచి రివ్యూ స్ వచ్చాయి.  ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ సినిమాకు బాక్సాపీస్ వద్ద కాస్తా దెబ్బ పడింది. 

Latest Videos


మరోవైపు డైనోసార్ ‘సలార్’కు పోటీగా ఈ చిత్రం విడుదలవటం కలెక్షన్లపై మరింత ప్రభావాన్ని చూపిందని నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. ఓవైపు సలార్ ఇప్పటికే రూ.600 కోట్లు క్రాస్ చేసింది. 

కానీ డంకీ మాత్రం కలెక్షన్లలో వెనకబడింది. 17 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.430 కోట్ల గ్రాస్ మాత్రమే దక్కింది. దీంతో మూవీ కలెక్షన్లు రూ.500 కోట్లు చేరుకోవాలంటే ఇంకాస్తా సమయం పట్టేట్టుగా కనిపిస్తోంది. 
 

ఇంకొన్ని రోజులు థియేటర్లలో పోరాడితే గానీ మిగిలిన కలెక్షన్లు అందనున్నాయి. టాక్ పర్లేదనిపించినా.. ఆడియెన్స్ మాత్రం ‘సలార్’కే జై కొట్టారు. ఏదేమైనా రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫైట్ చేస్తూనే ఉన్నాయి. 

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. షారుఖ్ ఖాన్ కూడా నిర్మాణ భాగస్వామ్యం పంచుకున్నారు. తాప్పీ, విక్కీ కౌషల్ ప్రధాన పాత్రలు పోషించారు. కానీ ఈ చిత్రం ‘పఠాన్’, ‘జవాన్’ తరహా ఆడలేకపోతోంది. 

click me!