అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ కలిసి తెరపై రచ్చ

Published : Jan 24, 2025, 08:11 AM IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి థమ్స్ అప్ ప్రకటనలో నటిస్తున్నారా? ఈ ఉత్కంఠభరితమైన కొలాబరేషన్ గురించి మరింత తెలుసుకోండి!

PREV
13
అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ కలిసి తెరపై రచ్చ
Shah Rukh Khan, Allu Arjun, Thums Up Campaign



అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ ఒకేసారి తెరపై కనిపిస్తే ఆ రచ్చే వేరు. ఆ సందడే వేరు. ముఖ్యంగా నార్త్ లో ఇద్దరి స్టార్స్ కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. షారూఖ్ ఫ్యాన్ బేస్ ని నార్త్ లో మ్యాచ్ చేయలేకపోయినా బన్నికు పుష్ప తో కొత్త జనరేషన్ లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అల్లు అర్జున్ డైరక్ట్ హిందీ మూవీ చేయలేదు. చేస్తే అక్కడ మరో సూపర్ స్టార్ అవతరిస్తాడు అంటోంది బాలీవుడ్ మీడియా. అందులో నిజమెంత ఉందనేది ప్రక్కన పెడితే ఇప్పుడు  అల్లు అర్జున్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)తో కొలాబరేట్ కాబోతున్నారు. అయితే సినిమా కోసం కాదు. 
  

23


షారుక్ ఖాన్, అల్లు అర్జున్ కొత్త థమ్స్ అప్ యాడ్ ప్రకటనలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ఐకాన్ స్టార్లు మొట్టమొదటిసారి స్క్రీన్ ని షేర్ చేసుకుంటే మామూలుగా ఉండదు అంటున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో ఈ వార్త  ఇప్పటికే వైరల్ గా మారింది.  బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్, సౌత్ స్టైలిష్ స్టార్ బన్నీతో కలిస్తే స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు.   ఫిబ్ర‌వ‌రి నెలాఖరు లేదా మార్చి మొదట్లో  థ‌మ్స‌ప్ ప్ర‌క‌ట‌న‌ను చిత్రీక‌రించే అవ‌కాశం ఉంది. 
 

33


అయితే నార్త్- సౌత్ సూప‌ర్‌స్టార్లు క‌లిసి కోలాల‌ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌డం ఇప్పుడే కొత్త కాదు. ప‌లు కోలా కంపెనీలు ఉత్త‌రాదిన క్రేజీ స్టార్ హీరోతో, ద‌క్షిణాది క్రేజీస్టార్‌ని క‌లిపి అత్యంత‌ భారీగా ప్ర‌క‌ట‌న‌ల‌ను రూపొందించి ప్ర‌చారం చేయ‌డం ద్వారా దేశ‌మంత‌టా విస్త్ర‌త ప్ర‌యోజ‌నాల‌ను పొందుతున్నాయి. గ‌తంలో బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ర‌ణ‌వీర్ సింగ్, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌లిసి థ‌మ్సప్ ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించారు. అంత‌కుముందు రామ్ చ‌ర‌ణ్, చిరంజీవి కూడా థ‌మ్సప్ కి ప్ర‌చారం చేసారు. 

Read more Photos on
click me!

Recommended Stories