OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే

Published : Aug 31, 2026, 07:31 AM IST

This Week OTT Releases: సెప్టెంబర్ తొలి వారంలో ఓటీటీలోకి ‘ది జెంటిల్‌మెన్: సీజన్ 2’, ‘గాంధారి’, ‘ది కోర్ట్’, ‘జగమే సంగీతం’తో పాటు పలు సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయి.

PREV
15
OTT Movies

సెప్టెంబర్ తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాలిటీ షోలు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు నెట్‌ఫ్లిక్స్‌, జియోహాట్‌స్టార్‌, ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ప్లస్‌ ఓటీటీల్లో కొత్త కంటెంట్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. వీటిలో ముఖ్యంగా ‘ది జెంటిల్‌మెన్: సీజన్ 2’, ‘గాంధారి’, ‘ది కోర్ట్’, ‘జగమే సంగీతం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

25
నెట్‌ఫ్లిక్స్

1000-lb Sisters: Season 9

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 1, 2026

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

కేటగిరీ : రియాలిటీ

అమీ స్లాటన్‌, టామీ స్లాటన్‌ సోదరీమణుల జీవితాలను ఈ రియాలిటీ సిరీస్‌ కొనసాగిస్తుంది. బరువుకు సంబంధించిన సవాళ్లతో పాటు కుటుంబం, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే పరిణామాలను ఈ సీజన్‌లో చూపించనున్నారు.

Jared Freid: The Family Plan

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 1, 2026

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

కేటగిరీ : స్టాండ్‌అప్ కామెడీ

కామెడీయన్‌ జారెడ్‌ ఫ్రైడ్‌ తన రెండో నెట్‌ఫ్లిక్స్‌ ప్రత్యేక కార్యక్రమంతో వస్తున్నారు. కుటుంబంతో చేసే ప్రయాణాలు, తల్లిదండ్రులతో సెలవులు, కుటుంబ జీవితంలోని సరదా అనుభవాలను తనదైన శైలిలో పంచుకోనున్నారు.

Untold Raygun: Breaking Badly

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 1, 2026

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

కేటగిరీ : డాక్యుమెంటరీ

2024 ఒలింపిక్స్‌లో తన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాచెల్ ‘రేగన్’ గన్‌ ప్రయాణాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు. ఆమె ప్రదర్శన తర్వాత వైరల్‌ అయిన మీమ్స్‌, తప్పుడు సమాచారం, వివాదాలపై కూడా ఇందులో దృష్టి సారించారు.

Fito Páez: The World Within a Song

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 3, 2026

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

కేటగిరీ : డాక్యుమెంటరీ

స్పానిష్‌ భాషలోని ప్రముఖ సంగీత కళాకారుల్లో ఒకరైన ఫిటో పాయెజ్‌ జీవితాన్ని ఈ డాక్యుమెంటరీలో ఆవిష్కరించారు. రికార్డింగ్‌లు, రిహార్సల్స్‌, పర్యటనలు, ప్రదర్శనలతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంలోని పలు అంశాలను ఇందులో చూపించనున్నారు.

The Gentlemen: Season 2

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 3, 2026

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

కేటగిరీ : వెబ్‌సిరీస్

థియో జేమ్స్‌, కాయా స్కోడెలారియో తదితరులు నటించిన ‘ది జెంటిల్‌మెన్’ రెండో సీజన్‌ సెప్టెంబర్‌ 3న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తండ్రి నుంచి భారీ ఆస్తిని వారసత్వంగా పొందిన ఎడ్డీ హార్నిమన్‌.. అది ఓ అక్రమ మాదకద్రవ్యాల సామ్రాజ్యంలో భాగమని తెలుసుకున్న తర్వాత ఎదురయ్యే పరిణామాల చుట్టూ ఈ కథ సాగుతుంది. రెండో సీజన్‌లో ఆ నేర సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే క్రమంలో కొత్త ప్రత్యర్థులు, కొత్త సమస్యలను ఎడ్డీ, సుసీ ఎదుర్కోనున్నారు.

Gandhari

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 3, 2026

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

కేటగిరీ : సినిమా

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాంధారి’. బాణి అనే తల్లి కథగా ఇది తెరకెక్కింది. రైల్వే స్టేషన్‌లో తన కుమార్తె కిడ్నాప్‌ కావడంతో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ తర్వాత తన కూతురిని వెతికే క్రమంలో ఆమె ఎదుర్కొనే ప్రమాదాలు, చైల్డ్‌ ట్రాఫికింగ్‌ నెట్‌వర్క్‌తో జరిగే పోరాటం కథలో కీలకంగా ఉంటుంది.

Teenage Wasteland

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 4, 2026

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

కేటగిరీ : డాక్యుమెంటరీ

1991లో న్యూయార్క్‌ ప్రాంతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ సాగుతుంది. ఇంగ్లిష్‌ టీచర్‌ ఫ్రెడ్‌ ఇసెక్స్‌ ప్రేరణతో కొంతమంది విద్యార్థులు సినిమా ప్రాజెక్ట్‌ చేపడతారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ ఊహించని విధంగా తమ ప్రాంతంలోని భూగర్భ జలాలను కలుషితం చేస్తున్న భారీ పర్యావరణ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది.

Earle Meets World

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 4, 2026

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్

కేటగిరీ : రియాలిటీ సిరీస్

సోషల్‌ మీడియా స్టార్‌ అలిక్స్‌ ఎర్ల్‌ జీవితాన్ని ఈ రియాలిటీ సిరీస్‌ చూపిస్తుంది. వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూనే తన వ్యక్తిగత జీవితాన్ని ఎలా కొనసాగిస్తుందనే అంశాలను ఇందులో ఆవిష్కరించనున్నారు.

35
జియోహాట్‌స్టార్

The Court

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 4, 2026

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్

కేటగిరీ : సినిమా

యాజిని అనే యువ న్యాయవాది చుట్టూ ‘ది కోర్ట్’ కథ సాగుతుంది. ఆమెకు నత్తి ఉండటంతో పాటు తన ప్రతిభావంతుడైన తండ్రి నీడలోనే పెరుగుతుంది. ఓ కేసు కారణంగా కోర్టులో తన తండ్రికి వ్యతిరేకంగా వాదించాల్సి వస్తుంది. ఈ క్రమంలో తనపై ఉన్న అనుమానాలను, సమాజం నుంచి ఎదురయ్యే వివక్షను అధిగమించి న్యాయం కోసం ఆమె చేసే పోరాటమే కథలో ప్రధానాంశం.

45
ప్రైమ్ వీడియో

Jagamae Sangeetham

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 4, 2026

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో

కేటగిరీ : వెబ్‌సిరీస్

కర్ణాటక సంగీతం నేపథ్యంలో రూపొందిన సంగీత కుటుంబ కథ ఇది. తన తాత శాస్త్రి సంగీత వారసత్వానికి వారసుడైన బాలూ.. కుటుంబ సంప్రదాయాలు, బంధాలు, పాత రహస్యాల మధ్య సతమతమవుతాడు. పాత ప్రత్యర్థిత్వాలు మళ్లీ తెరపైకి రావడంతో తరతరాలుగా వస్తున్న సంగీత వారసత్వాన్ని కాపాడుకోవాలా, లేక తన సొంత మార్గాన్ని ఎంచుకోవాలా అనే డైలమాలో పడతాడు. ఈ సిరీస్‌లో ప్రకాశ్‌రాజ్‌, మధూ, శ్రీకాంత్‌ మేకా, అక్షయ్‌ లగుసాని కీలక పాత్రల్లో నటించారు.

55
యాపిల్ టీవీ ప్లస్

Mayday

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 4, 2026

ఎక్కడ చూడాలి : యాపిల్ టీవీ ప్లస్

కేటగిరీ : సినిమా

రియాన్‌ రేనాల్డ్స్‌, కెన్నెత్‌ బ్రానా, మారియా బకలోవా ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘మేడే’. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా నేవీ పైలట్‌ లెఫ్టినెంట్‌ ట్రాయ్‌ ‘అసాసిన్‌’ కెల్లీని రష్యా భూభాగంలో ఓ రహస్య మిషన్‌కు పంపిస్తారు. ఆ ఆపరేషన్‌ విఫలమవడంతో అతను శత్రు భూభాగంలో చిక్కుకుపోతాడు. అక్కడ మాజీ కేజీబీ ఏజెంట్‌ నికోలాయ్‌ ఉస్టినోవ్‌తో అతనికి అనూహ్యమైన స్నేహం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి ట్రాయ్‌ను అక్కడి నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories