NTR Jayanthi:విచిత్ర కుటుంబం నుంచి సామ్రాట్ అశోక వరకూ ఎన్టీఆర్ పుట్టిన రోజు రిలీజ్ అయిన సినిమాలు...?

Published : May 28, 2022, 12:04 PM IST

 తెలుగు జాతి మెచ్చిన పేరు నందమూరి తారక రామారావు ఈ పేరు.. ప్రతీ తెలుగు వాడు గర్వపడే నటుడు నందమూరి తారకరాముడు. ఆయన నటనకు కళామతల్లి మురిసిపోయింది. ఇక ఎన్నో సినిమాలలో నటించిన పెద్దాయన.. కొన్నిసినిమాలు మాత్రం ఆయన పుట్టిన రోజునాడే రిలీజ్ అయ్యాయి.. దాదాపు ఏడెనిమిది సినిమాలు ఆయన బర్త్ డే రోజు రిలీజ్ అయ్యాయి. మరి ఆసినిమాలేంటో చూద్దాం.. 

PREV
18
NTR Jayanthi:విచిత్ర కుటుంబం నుంచి సామ్రాట్ అశోక వరకూ ఎన్టీఆర్ పుట్టిన రోజు రిలీజ్ అయిన సినిమాలు...?

తెలుగు చిత్ర పరిశ్రమకు, తెలుగు రాజకీయాలకు  వన్నెతెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. ఎన్నో జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించడమే కాక ఆయా పాత్రల్లో జీవించి తన దివ్య మోహనరూపం తో ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఎన్టీఆర్. ఆయన నటించిన కొన్నిసినిమాలు ఆయన పుట్టినరోజే రిలీజ్ అయ్యాయి. విచిత్ర కుటుంబం నుంచి సామ్రాట్ అశోక వరకూ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలేమిటంటే.,.

28

ముందుగా ఎన్టీఆర్ పుట్టిన రోజున రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ విచిత్ర కుటుంబం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తండ్రి కెఎస్ ప్రకాశ్ రావ్ డైరెక్ట్ చేసిన ఈమూవీలో అప్పటి స్టార్ కాస్ట్ చాలా మంది నటించిరు ఎన్టీఆర్ సావిత్రితో పాటు శోభన్ బాబు, కృష్ణ, విజయ నిర్మల లాంటి స్టార్స్ నటించిన ఈమూవీ 1969 మే 28న రిలీజ్ అయ్యింది. 

38

ఇక ఆరువాత ఆరేళ్ళ గ్యాప్ తరువాత మరోసారి ఎన్టీఆర్ సినిమా ఆయన పుట్టిన రోజునే రిలీజ్ అయ్యింది. సరిగ్గా 1975 మే 28న గ్రాండ్ రిలీజ్ అయ్యింది సంసారం సినిమా. ఈసినిమా కూడా మల్టీ స్టారర్ గానే తెరకెక్కింది. ఎన్టీఆర్ తో పాటు ఏఎన్నార్ కూడా స్క్రీన్ శేర్ చేసుకున్నారు ఈ మూవీలో. 
 

48

ఇక శ్రీమద్వీరాట పర్వం సినిమా కూడా నందమూరి తారకరాముని పుట్టిన రోజునే రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ నట విశ్వరూపానికి మచ్చు తునకగా నిలిచిన ఈ సినిమాలో వాణిశ్రీ ఎన్టీఆర్ జోడీగా అలరించింది. ఇక ఈసినిమాలో నట సింహం బాలయ్య కూడా ఓ పాత్రలో కనిపించారు. 1979 మే 28న ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈసినిమా రిలీజ్ అయ్యింది. 

58

ఆతరువాత వరుసగా మూడేళ్లు నవరసనటసార్వభౌముడి పుట్టిన రోజున సినిమాలు రిలీజ్ అయ్యాయి. 1981 లో భారీ మల్టీ స్టారర్ గా రూపుదిద్దుకున్న సత్యంశివం  సినిమా మే 28న   రిలీజ్ అయ్యింది. ఈసినిమాలో ఎన్టీఆర్ తో పాటు అక్కినేని నాగేశ్వరావు, బానుచందర్, రతీ అగ్నిహోత్రీ, శ్రీదేవి, విజయశాంతి లాంటి స్టార్స్ నటించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. 

68

ఇక  1982 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన జస్టిస్ చౌదరి సినిమా కూడా   పెద్దాయన పుట్టిన రోజునే రిలీజ్ అయ్యింది.  రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో ఎన్టీఆర్ జోడీగా శ్రీదేవి నటించింది.శారద,జయంతి లాంటి స్టార్స్ నటించిన ఈసినిమా పెద్దాయన పుట్టిన రోజును మెమరబుల్ చేసింది. 
 

78

ఇక వరుస క్రమంలో 1983 లో కూడా ఎన్టీఆర్ బర్త్ డేకు ఒక సినిమా రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ స్వయంగా డైరెక్ట్ చేసి.. నిర్మించి, నటించిన     చండశాసనుడు సినిమా కూడా ఆయన పుట్టిన రోజునాడు 1983 మే 28న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో గంభీరమైన పాత్రలో అలరించి... మెుప్పించారు ఎన్టీఆర్.
 

88

ఈ సినిమా తరువాత దాదాపు పదేళ్ల వరకూ   ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఆయన సినిమాలేవి రిలీజ్ అవ్వలేదు. మళ్ళీ 1992 లో పెద్దయన పుట్టన రోజుకు  సామ్రాట్ అశోక రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా ఆయనే స్వయంగా డైరెక్ట్ చేసి, నిర్మించారు. వాణీ విశ్వనాథ్ కూడా నటించిన ఈసినిమా పర్వాలేదు అనిపించింది. ఇలా పెద్దాయన       నట జీవితంలో ఏడు సినిమాలు ఆయన పుట్టిన రోజున సందడి చేశాయి. 

click me!

Recommended Stories