సుశాంత్‌ మరణానికి ఏడాదిః ట్రెండింగ్‌లో `#JusticeForSushantSinghRajput`‌..

Published : Jun 14, 2021, 02:11 PM IST

హిందీ నటుడు, `ధోనీ` ఫేమ్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గతేడాది జూన్‌ 14న ఆత్యహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సరిగ్గా నేటితో(సోమవారం) ఏడాది అవుతుంది. ఇంతకి ఏం తేల్చారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.   

PREV
16
సుశాంత్‌ మరణానికి ఏడాదిః  ట్రెండింగ్‌లో `#JusticeForSushantSinghRajput`‌..
సుశాంత్‌ మరణం బాలీవుడ్‌ని మాత్రమే కాదు, యావత్‌ ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసింది. ప్రాథమికంగా ఆయనది ఆత్మహత్యగా భావించారు. డిప్రెషన్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. కానీ ఆయనది హత్య అంటూ ప్రచారం జరిగింది. సుశాంత్‌ తండ్రి సైతం ఇదే విషయాన్ని ఆరోపించారు. మరోవైపు సుశాంత్‌ మరణంతో నెపోటిజం, ఇండస్ట్రీలోని బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు వంటి బయటపడ్డాయి.

26
కొందరు బడా మేకర్స్ సుశాంత్‌కి అవకాశాలు లేకుండా చేసి బెదిరింపులకు దిగి ఆత్మహత్యకి పురికోల్పారని, డ్రగ్స్ మాఫియాలో ఇరికించి ఇబ్బంది పెట్టారని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుశాంత్‌ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి ప్రమేయం ఉందని అన్నారు. ఆమె చుట్టూ కొన్నాళ్లు ఈ కేసు తిరిగింది. మరోవైపు సుశాంత్‌ మేనేజర్‌ దిశా ఆత్మహత్య కేసు చుట్టూ తిరిగింది. అలాగే సుశాంత్‌ బ్యాంక్‌ లావాదేవిలు, రియాకి సంబంధంపై కూడా ఆరోపణలు వచ్చాయి.

36
ఇందులో రాజకీయ ప్రముఖులు కూడా ఇన్‌వాల్వ్ అయ్యారు. మరోవైపు కంగనా సుశాంత్‌ మరణానికి నెపోటిజమంటూ ఓ ఉద్యమానికి తెరలేపింది. ఆయనకు మద్దతుగా ఇండస్ట్రీలో ఉన్న కొందరు చేసిన చీకటి కోణాలను బయటపెట్టే ప్రయత్నం చేసింది.

46
సుశాంత్‌ కేసు ముంబయి పోలీసుల నుంచి కేసు సీబీఐకి చేరింది. ఆరోపణలు, అవమానాలు, వివాదాలతో విచారణ తిరిగింది. ఇంకా తిరుగుతూనే ఉంది. ఫోరెన్సిక్‌ రిపోర్ట్ లో సుశాంత్‌ది ఆత్మహత్యనే అని తేల్చారు. కానీ దీనిపై వాళ్లు కూడా సరైన ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో సుశాంత్‌ మరణం మిస్టరీగానే మారింది. ఇంకా ఈ కేసులో ఏమాత్రం పురోగతి లేకపోయింది. అంతేకాదు ఇప్పుడు చూడబోతే ఈ కేసుని సీబీఐ వదిలేసిందా? అనేట్టుగా మారింది.

56
ఏడాది పూర్తయినా సుశాంత్‌ మరణం మిస్టరీగానే మారింది. దీనిలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆయన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. `#JusticeForSushantSinghRajput` అనే యాష్‌ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. మన దేశంలోని విచారణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో మరోసారి చాటుతున్నారు.

66
సుశాంత్‌ మరణానికి ఏడాది కావడంతో ఫ్యాన్స్ ఆయన బాల్యం, అతని చదువు, వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు, సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. సుశాంత్‌ కేసులో న్యాయం కావాలని కోరుకుంటూ ఇదొక `చీకటి రోజు` గా ప్రకటించారు. సుశాంత్‌ 2020 జూన్‌ 14, ముంబయి, బంద్రాలోని తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంకెన్నిరోజులు విచారణ జరుగుతుంది. ఫైనల్‌ జడ్జిమెంట్‌ ఎప్పుడొస్తుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories