ఇన్నేళ్ళలో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాను ఏలారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. హిందీలో కూడా ఒకటి రెండు చిత్రాలు చేసినట్లు ఉన్నారు. రజినీకాంత్, కమల్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి టాప్ స్టార్స్ తో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు.