లేత పచ్చ కలర్‌ డ్రెస్‌లో కీర్తిసురేష్‌ పరువాల విందు.. హోమ్లీ బ్యూటీ నయా లుక్‌ అదిరిపోయింది!

First Published | Nov 28, 2022, 8:56 PM IST

కీర్తి సురేష్ హోమ్లీ అందాలతో ఆకట్టుకుంటుంది. క్యూట్‌ లుక్స్ తో మతిపోగొడుతుంది. తాజాగా అందాల భామ మరింతగా ఆకట్టుకుంటుంది. నయా పోజులతో కనువిందు చేస్తుంది. 
 

కీర్తి సురేష్‌(Keerthy Suresh) ఆ మధ్య హాట్‌ డోస్‌ పెంచింది. కానీ ఇప్పుడు మళ్లీ తన ఒరిజినాలిటీని బయటపెట్టింది. హోమ్లీ బ్యూటీగా మారిపోయింది. లేత పచ్చ కలర్ పంజాబీ డ్రెస్‌ వేసింది కీర్తిసురేష్‌. ఇందులో తనపరువాలు విందుతో అభిమానులను ఆకట్టుకుంది. చిలిపిగా కవ్విస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

షూటింగ్‌ లొకేషన్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది కీర్తి. ఇంకా పేరుపెట్టని, అధికారికంగా అనౌన్స్ చేయని ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొందట. ఈ సందర్భంగా తన షూటింగ్‌ చాలా బాగా సాగిందని తెలిపింది. షూటింగ్‌ ఆద్యంతం ఫన్‌ తో సాగిందని, నవ్వులే నవ్వులని పేర్కొంది. 
 


షూటింగ్‌ సందర్భంగా మర్చిపోలేని మెమరీస్‌ని ఇచ్చిందని పేర్కొందని చెబుతూ, ఆనందాన్ని వ్యక్తంచేసింది కీర్తిసురేష్‌. ఇందులో తన పెట్‌ డాగ్‌ నైక్‌తో దిగిన పిక్స్ ని కూడా షేర్‌ చేసింది కీర్తి. ప్రస్తుతం ఈ ఫోటోలు తన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కీర్తి అందాలు కట్టిపడేస్తున్నాయి. ట్రెడిషనల్‌ లుక్‌లోనూ కట్టిపడేసేలా కీర్తి అందాలుండటం విశేషం. 

కీర్తిసురేష్‌ ఆ మధ్య హాట్‌ డోస్‌ అమాంతం పెంచేసింది. `సర్కారు వారి పాట` సినిమా సమయంలో కీర్తి గ్లామర్‌ డోస్‌ షాకిచ్చేలా ఉండటం విశేషం. మనింట్లో అమ్మాయిలా కనిపించే కీర్తి ఐటెమ్‌ భామలా మారిపోయే గ్లామర్‌ షో చేసింది. అభిమానులను,నెటిజన్లకి షాకిచ్చింది. వరుసగా హాట్‌ హాట్‌గా ఫోటో షూట్లు చేసింది. ఇంటర్నెట్‌లో హాట్‌ డిస్కషన్‌గా మారింది. 
 

అయితే వరుసగా పరాజయాలు చవిచూడటంతో కీర్తికి అవకాశాలు తగ్గిపోయాయి. ఛాన్స్ ల కోసం చివరికి కీర్తి కూడా హాట్‌ షో చేస్తుందా? అనే కామెంట్లు వచ్చాయి. మరి ఆమె అందాల విందు పని చేసిందో లేదో గానీ ఇప్పుడు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంది కీర్తిసురేష్‌. 

ప్రస్తుతం ఆమె తెలుగులో చిరంజీవికి చెల్లిగా `భోళా శంకర్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే నానితో `దసరా` సినిమాలో డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించనుంది. మరోవైపు తమిళంలో జయం రవితో ఓ సినిమా చేస్తుంది. దీంతోపాటు మరో సినిమాలోనూ నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్‌ లొకేషన్‌లోని ఫోటోలనే తాజాగా షేర్‌ చేసింది కీర్తి సురేష్‌. 
 

Latest Videos

click me!