పెళ్ళై ఆల్రెడీ పిల్లలున్న వ్యక్తులని పెళ్లి చేసుకున్న హీరోయిన్లలో ముందుగా మహానటి సావిత్రి, అతిలోక సుందరి శ్రీదేవి గుర్తుకు వస్తారు. అదే పని చేసిన మరో సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా ఉన్నారు. ఆమె ఎవరో కాదు శారద. 90 వ దశకం నుంచి శారద తల్లి పాత్రలతో పాపులర్ అయ్యారు కానీ అంతకు ముందు ఆమె వాణిశ్రీ తరహాలో స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి లెజెండ్స్ తో ఎన్నో చిత్రాల్లో నటించారు.