హీరోయిన్లు వేశ్యలా..? నోరు..నాలుక జాగ్రత్త.. నటి కస్తూరి మాస్ వార్నింగ్, త్రిషకు మద్దతుగా పోరాటం

Published : Feb 22, 2024, 01:16 PM IST

నటి త్రిషపై అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శి వ్యాఖ్యలపై మండిపడ్డారు సీనియర్ నటి కస్తూరి శంకర్. ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు కస్తూరి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..? 

PREV
110
 హీరోయిన్లు వేశ్యలా..? నోరు..నాలుక జాగ్రత్త.. నటి కస్తూరి  మాస్ వార్నింగ్, త్రిషకు మద్దతుగా పోరాటం

తమిళనాట కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు నటి కస్తూరి శంకర్. ప్రతీ విషయంలో స్పందిస్తారు  కస్తూరి. ముఖ్యంగా ఆడవారిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఆమె వార్నింగ్ గట్టిగా స్పందిస్తారు.. మాస్ వార్నింగ్ ఇస్తుంటారు. ఇక తాజాగా కస్తూరీ శంకర్ త్రిష విషయంలో స్పందించారు. ఆమెపై అన్నా డీఎంకే నేత మాట్లాడిన కాంట్రవర్సియల్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏంటుందంటే..? 

210

కస్తూరీ శంకర్ మాట్లాడుతూ.. ఈరోజు నేను నిజంగా నన్ను బాధపెట్టే విషయం గురించి మాట్లాడబోతున్నాను.ఈ మధ్య సినిమా నటీమణులపై దూషణలు ఎక్కువయ్యాయి.ఏమాత్రం నిజానిజాలు చూసుకోకుండా మాట్లాడుతున్నారు. తమకు నోరు, నాలుకలు ఉన్నాయని  ఏది పడితే అది మాట్లాడటంకరెక్ట్ కాదు అంటూ కస్తూరి మండిపడ్డారు. 

310

త్రిషపై ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి ఆమధ్య నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా ఇలాంటివే చేశారు.. అది అయిపోయింది అనుకుంటే .. అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శి చాలా అసహ్యకరమైన కామెంట్స్ చేశారు. ఇలాంటివి సమాజానికి మంచిది కాదు అన్నారు. కస్తూరి శంకర్. ఆయన పార్టీ నేతలతో వ్యక్తిగత దూషణలు, పలు సమస్యలు ఉండవచ్చు. తాను చూడని విషయాన్ని, పూర్తిగా తెలియని విషయాన్ని తనకు బాగా తెలిసినట్లుగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు కస్తూరి. 

410

అసలు మీకు మేము ఎలా కనిపిస్తున్నాము.. సినీరంగంలో ఉన్నవారంతా వేశ్యల్లా కనిపిస్తున్నారా..? మీరు చేసే కామెంట్స్ అలానే ఉన్నాయి. కాని  సినిమాలో నటీనటులందరూ పని చేసే వారికి అమ్మానాన్నలు ఉంటారు.. వారి గురించి ఆలోచించారా...? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ.. ఒక నటి గురించి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అంటూ ఫైర్ అయ్యారు కస్తూరి. 
 

510

నటీమణులు వ్యభిచారిణులు, నటులు వర్క్‌హోలిక్‌లు అంటూ  మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీరు ఇలా మాట్లాడితే.. రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలి అనుకున్నవారి పరిస్థితి ఏంటి..? వారికి ఇది ఎదురుదెబ్బ.. వీ వల్ల మంచి రాజకీయనాయకులను కూడా నమ్మడానికి లేకుండాపోయింది. మీ వల్ల వారికి కూడా చెడ్డపేరు వస్తుంది అన్నారు. 

610

అంతే  కాదు.. వందేళ్లకు పైగా ఇంటికే పరిమితమైన మహిళలు కొన్ని దశాబ్దాల్లోనే బయటకు వచ్చి ప్రజాజీవితంలో భాగస్వామ్యమవుతున్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అధిగమించి తమ జీవితాల్లో విజయాలు సాధిస్తున్నారు.

710
av raju trisha

కాని మీలాంటివారి వల్ల మళ్లీ మహిళలు వెనకబడే అవకాశం ఉంది అన్నారు కస్తూరి. అంతే కాదు సినిమాల్లోకి రావడానికిమహిళలు చాలా ధైర్యం చేయాల్సి ఉంది. కాన సినిమాల్లోకి వచ్చాక మీలాంటివారు ఇలాంటి ముద్రలు వేస్తుంటే.. వారు ఎలా పనిచేసకోగలరు. ఇంకా ఎన్ని ఇలాంటివి మహిళలు ఎలా తట్టుకుని ముందుకు వెళ్లాళి..నటీమణులపై ఇలాంటి దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు కస్తూరి. 

810
kasthuri

అంతే కాదు నోటి నటీమణులకు కస్తూరి ఓ సలహా కూడా ఇచ్చారు. నా తోటి నటీమణులు నాలాగా సామాజిక సమస్యలను వినిపించకపోవచ్చు. వాళ్లంతా తెలియని మూర్ఖులు కాదు. వాళ్ళు కూడా మనుషులే. వారికి ఆత్మ ఉంది, వారికి ఆత్మగౌరవం కూడా ఉంది. వారికి వ్యక్తిగత జీవితాలు కూడా ఉన్నాయి. పేర్లు చెప్పి ఇన్ని లక్షలు ఇచ్చారని చెప్పి అవమానించడం కరెక్ట్ కాదు..  

910
Trisha

తమిళనాట అందరూ అమ్మగా పిలిచిఅభిమానించే మహిళగా, నటిగా, నాయకురాలిగా వెలుగొందిన జయలలిత పార్టీలో.. మహిళలను ఇలా కించపరిచేవారికి ఎలా స్థానం కలిపిస్తారు. జయలలిత ఉండి ఉంటేు ఇలా మాట్లాడేవారా..? ఇదంతా తలుచుకుంటే నామనసుతట్టుకోలేకపోతుంది అన్నారు కస్తూరి. 
 

1010
kasthuri condumned thirumavalavan

ఈ విషయంలో కచ్చితంగా ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్‌లో ఉన్న నటి ఖుష్బూ కూడా ఈ విషయంలో స్పందించాలి..  తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు కస్తూరి. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం, న్యాయశాఖ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories