Poonam Kaur
పూనమ్ కౌర్-పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల కేంద్రంగా ఓ వివాదం ఉంది. పవన్ కళ్యాణ్ తో పూనమ్ కి ఎఫైర్ ఉంది. వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాల్సింది. అయితే త్రివిక్రమ్ కారణంగా ఆమెకు అన్యాయం జరిగింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్... పూనమ్ కౌర్ ని ఇబ్బందులకు గురి చేశారనే వాదన ఉంది.
ఈ విషయాన్ని ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ తెరపైకి తెచ్చాడు. కాటమరాయుడు చిత్రానికి నెగిటివ్ రివ్యూ ఇచ్చిన కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆయనను వేధింపులకు గురి చేశారు. దీనికి ప్రతిగా కత్తి మహేష్... పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల మీద ఆరోపణలు చేశాడు.
Poonam Kaur
పూనమ్ కౌర్ కి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తీరని అన్యాయం చేశారు. నా వద్ద ఆధారాలు ఉన్నాయని టీవీ డిబేట్స్ లో చెలరేగిపోయాడు. అయితే కత్తి మహేష్ వ్యాఖ్యలను పూనమ్ కౌర్ కుటుంబ సభ్యులు ఖండించారు. మరోవైపు పూనమ్ పరోక్షంగా పవన్, త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తూ ఉంటారు.
గతంలో ఇండైరెక్ట్ అటాక్ చేసిన పూనమ్ ఈసారి పేరు పెట్టి మరీ తిట్టింది. పవన్ కళ్యాణ్ భీమవరంలో జనసేన నేతలతో మాట్లాడుతూ... జగన్ సిద్ధం అంటున్నాడు. మేము యుద్ధం అంటాము. సినిమాల్లో కూడా నేను పంచ్ డైలాగ్స్ చెప్పడానికి ఇష్టపడను. అత్తారింటికి దారేది మూవీలో సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను... అనే డైలాగ్ చెప్పడానికి నేను ఇబ్బంది పడ్డాను. చేసేది లేక త్రివిక్రమ్ కామెడీగా చెప్పించాడు... అని అన్నారు.
ఈ వీడియోని ఓ మీడియా సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దాని క్రింద కామెంట్ గా.. 'యూస్ లెస్ ఫెలో' అని పూనమ్ రాసింది. హ్యాష్ ట్యాగ్ తో త్రివిక్రమ్ పేరు జోడించింది. దీంతో గతంలో పూనమ్ వేసిన కౌంటర్లు త్రివిక్రమ్ గురించే అని క్లారిటీ వచ్చింది.
Poonam Kaur
ఈ క్రమంలో త్రివిక్రమ్ , పవన్ అంటే పూనమ్ కౌర్ కి కోపం ఎందుకు? కత్తి మహేష్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందా? అనే చర్చ మొదలవుతుంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మాత్రం ఏనాడు స్పందించింది లేదు.
ఈ క్రమంలో త్రివిక్రమ్ , పవన్ అంటే పూనమ్ కౌర్ కి కోపం ఎందుకు? కత్తి మహేష్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందా? అనే చర్చ మొదలవుతుంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మాత్రం ఏనాడు స్పందించింది లేదు.