బ్యూటీఫుల్ స్మైల్ తో మైమరిపిస్తున్న భూమిక.. ఇప్పటికీ ఆ మత్తు కళ్లతో మాయజేస్తున్న సీనియర్ బ్యూటీ

First Published | Mar 30, 2023, 5:02 PM IST

సీనియర్ నటి భూమికా చావ్లా (Bhumika Chawla) రోజురోజుకు మరీ యంగ్ గా మారిపోతున్నారు. ట్రెండి వేర్స్, ట్రెడిషనల్ వేర్స్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా చుడీదార్ లో మంత్రముగ్దులను చేసింది.
 

టాలీవుడ్ హీరోయిన్ గా ఒకప్పుడు ఊపూపింది నటి భూమికా చావ్లా. బడా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ ల సరసన నటించిన తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. తన అద్భుతమైన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు. 
 

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న భూమిక.. ఆయా చిత్రాల్లో మెరుస్తూ వస్తున్నారు. కీలక పాత్రలు పోషిస్తూ తన అభిమానులతో పాటు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ భూమికా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. 
 


ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు తమ సెకండ్ ఇన్నింగ్స్ కేరీర్ ను మరింత స్పీడ్ గా ముందుకు తీసుకెళ్లెందుకు ఇంటర్నెట్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుర్ర హీరోయిన్లతో పోటీ పడి మరీ ఫొటోషూట్లు చేస్తున్నారు. నాలుగు పదుల వయస్సులోనూ చెక్కుచెదరని అందంతో మెస్మరైజ్ చేస్తున్నారు.
 

భూమికా సైతం ఇటీవల నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. ఏకంగా మినీ గౌన్ లో దర్శనమిస్తూ షాకిస్తున్నారు. గ్లామర్ మెరుపులతో  ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మైమరిపిస్తున్నారు. తాజాగా భూమిక చుడీదార్ లో దర్శనమిచ్చింది. ఫొటోలకు తనదైన శైలిలో ఫోజులిస్తూ కట్టిపడేస్తోంది.

మత్తు కళ్లతో గుచ్చే చూపులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏమాత్రం మారిపోని రూపసౌందర్యం, బ్యూటీఫుల్ స్మైల్ తో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. చుడీదార్ లో మెరిసినా మతిపోయేలా ఫోజులిచ్చి మైమరిపించింది. ఆ ఫొటోలను అభిమానులతో నెట్టింట షేర్ చేసుకుంది. 

చివరిగా భూమికా ‘సీతారామం’, ‘బటర్ ఫ్లై’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తమిళంలో విడుదలైన ఉదయానిధి స్టాలిన్ ‘కన్నై నంబాతే’లో మెరిసింది. ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే భూమిక ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తున్నారు. 

Latest Videos

click me!