బ్లూ ఫిలిమ్స్‌ కేస్‌లో ఇరికించింది అతనే.. సంచలన విషయం చెప్పిన హీరో సుమన్‌

First Published Jul 17, 2020, 3:27 PM IST

తెలుగు తెర మీద అందాల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సుమన్‌. ఒకప్పడు టాలీవుడ్‌ లో క్రేజీ హీరోగా, యాక్షన్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సుమన్‌ కెరీర్‌ ఒక్కసారిగా తిరగబడింది. ఆయన అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్లటంతో ఆయన కెరీర్‌ పూర్తిగా దెబ్బతింది. అయితే సుమన్ జైలు వెళ్లటం వెనుక ఓ ప్రముఖ హీరో ఉన్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

తమిళ్ ఇండస్ట్రీలో వెండితెరకు పరిచయం అయిన సుమన్‌ టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ అందుకున్నాడు. భాను చందర్‌ సాయంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన సుమన్‌కు యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్‌ వచ్చింది. మార్షల్‌ ఆర్ట్స్‌ లో ప్రావీణ్యం ఉండంటంతో పాటు హీరోయిక్‌ పర్సనాలిటీ కూడా ప్లస్‌ అవ్వటంతో సుమన్‌ టాప్ హీరోలకు కూడా పోటీ ఇచ్చే స్థాయికి వచ్చాడు.
undefined
అప్పట్లో చిరంజీవి సహా ఆ జనరేషన్‌ హీరోలందరికీ సుమన్‌ గట్టి పోటి ఇచ్చాడు. కెరీర్‌ సూపర్‌ ఫాంలో ఉన్న సమయంలో సుమన్‌ బ్లూ ఫిలింస్‌ కేసులో జైలుకు వెళ్లటంతో కెరీర్‌ తిరగబడింది. అప్పట్లో సుమన్‌ ఎదుగుదలను ఆపేందుకునే ఆయన్ను తప్పుడు కేసుల్లో ఇరికించారన్న ప్రచారం కూడా జరిగింది.
undefined
సుమన్‌ను బ్లూ ఫిలింస్‌ కేసులో అరెస్ట్ చేసినా ఆయన మీద గూండా యాక్ట్‌ పెట్టారు. అయితే ఈ విషయంలో ఓ టాప్‌ హీరో ప్రముఖంగా వినిపించింది. సుమన్‌ తనకు పోటి అవుతాడన్న ఉద్దేశంతో ఆ హీరోనే వెనుకుండి ఇదంతా చేయించాడన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో అన్ని రూమర్స్‌ గా కొట్టిపారేశారు.
undefined
అయితే చాలా సందర్భాల్లో ఈ విషయంపై సుమన్‌ క్లారిటీ ఇచ్చే ప్రయ్నతం చేసినా ప్రతీ వేదిక మీద ఆయనకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. సుమన్‌ను ఇరికించింది ఎవరు..? ఇండస్ట్రీ వ్యక్తులనేనా..? బయటి వారా..? భానుచందర్‌ను కూడా ఇబ్బంది పెట్టాలని చూశారా..? ఇలా ఎన్నో ప్రశ్నలు తరుచూ మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తుంటాయి.
undefined
అయితే ఈ విషయంలో గతంలో క్లారిటీ ఇచ్చిన సుమన్‌, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి మాట్లాడారు. తనను ఇబ్బంది పెట్టిన వ్యక్తి గురించి గతంలో ఓ తమిళ పత్రిక ఇంటర్వ్యూలో అన్ని విషయాలు చెప్పానని చెప్పిన సుమన్‌, అతని పేరు దివాకర్ అని తెలిపాడు. అతని ఇండస్ట్రీతో సంబంధం లేదని, తన సమస్య పూర్తిగా ప్రైవేట్‌ ఫ్యామిలీ ఎఫైర్‌ అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వివాదంలోకి సినిమా వాళ్లను మీడియానే లాగిందని ఆవేదన వ్యక్తం చేశాడు సుమన్.
undefined
తనకు జైలుకు వెళ్తానన్న విషయం ముందే తెలుసన్న సుమన్‌, భాను చందర్‌ను కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశాననిచెప్పాడు. ఆ సమయంలో భాను చందర్‌తో తనను కలవొద్దని, ఫోన్‌ కూడా చేయోద్దని చెప్పానని చెప్పాడు. నేను తెలుగులో అయితే బాగా క్లిక్‌ అవుతానని నమ్మిన వ్యక్తి భాను, నా వల్ల అతను ఇబ్బందులు పడకూడాదనే అలా చెప్పానన్నాడు సుమన్‌.
undefined
నేను ఇరుక్కున్నా నా వల్ల ఇతరులు ఇబ్బంది పడుకూడదనే ఉద్దేశంతోనే ఆలోచించాను. ఆ రోజు జరిగిన దానికి పూర్తి కారణం అప్పటి నా మిత్రుడు దివాకరే. అతనికి సంబంధించి విషయాలేవి నేను సీక్రెట్‌గా ఉంచలేదు. కానీ మీడియా మాత్రం కొంత మంది హీరోల పేర్లు తెర మీదకు తీసుకువచ్చింది. అవన్నీ వట్టి పుకార్లే.. ఆ రోజు జరిగిన దానితో ఏ హీరోకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు.
undefined
అప్పట్లో ఓ స్టార్ హీరో, చెన్నై సిటీ కమిషనర్‌ నా అరెస్ట్ వెనుక ఉన్నట్టుగా పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగింది. అవన్నీ రూమర్సే. శత్రువులు నా విషయంలో వాళ్లను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. నేను జైలుకు వెళ్లడానికి స్టార్ హీరో కారణం అన్న విషయం నేను ఒప్పుకోను. అక్కడ జరిగినదంతా వేరు అంటూ క్లారిటీ ఇచ్చారు సుమన్.
undefined
నాపై గూండా యాక్ట్‌ పెట్టడంతో పరిస్థితి సీరియస్‌ అయ్యింది. అసలు విషయం బయటకు రావాడానికి చాలా సమయం పట్టింది. అంతకు ముందు ఇలాంటి కేసులు రిఫరెన్స్‌ లేకపోవటంతో అన్ని విషయాలు చర్చించి క్లీన్‌ చీట్‌ ఇవ్వడానికి సమయం పట్టింది. చివరకు అన్ని ఆరోపణలు ఉత్తదే అని తేలిపోయింది అని అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు సుమన్‌.
undefined
click me!