వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా..
శోభన్ బాబు హీరోగా నటించిన ‘సర్పయాగం’ సినిమాతో రఘునాథ్ రెడ్డి నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ అనేక చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, భోజ్‌పురి భాషల్లోనూ రఘునాథ్ రెడ్డి వందల సినిమాల్లో నటించారు.
అన్ని భాషల్లో తన నటనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు రఘునాథ్ రెడ్డి. చిన్న పాత్ర అయినా, పెద్ద పాత్ర అయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంలో రఘునాథ్ రెడ్డి ప్రత్యేకతగా నిలిచారు.
కొడుకు మరణం తట్టుకోలేకపోయిన నటుడు..
ఈ మధ్య కాలంలోనే కొన్ని నెలల క్రితం రఘునాథ్ రెడ్డి కుమారుడు గుండెపోటుతో మృతి చెందారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక రఘునాథ్ రెడ్డి మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం. ఆ ఘటన తర్వాత ఆయన చాలా క్షోభను అనుభవించినట్లు తెలిసింది.
అదే ఆలోచనతో రఘునాథ్ రెడ్డి ఆరోగ్యంగురించి పట్టించుకోలేదు. కుమారుడి మరణం తట్టుకోలేక రఘునాథ్ రెడ్డి కూడా గుండె పోటుకు గురయ్యారు. నెలల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.