అక్కినేని నాగార్జున తన తొలి చిత్రం తర్వాత ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు అనే విషయాలని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అదే విధంగా ప్రస్తుతం నాగ చైతన్య సినిమాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అక్కినేని నాగార్జున 1986లో అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున నటించిన తొలి చిత్రం విక్రమ్. ఈ మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. కానీ నాగార్జున నటనకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీని గురించి నాగార్జున ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.విక్రమ్ నా ఫస్ట్ మూవీ. అందులో డైలాగ్ డెలివరీ బాగాలేదు.
25
డైలాగుల కోసం నాగార్జున కష్టాలు
నాపై విమర్శలు వచ్చాయి. తెలుగు డైలాగులు సరిగ్గా చెప్పడం కోసం చాలా కష్టపడ్డాను. తెలుగు బాగా వచ్చిన వ్యక్తిని దగ్గర పెట్టుకుని మాడ్యులేషన్ నేర్చుకునే వాడిని. నాన్నగారు నటిస్తున్నప్పుడే సినిమాల్లోకి వచ్చాను. ఆయనతో ఎప్పుడూ కాంపిటీషన్ ఫీల్ కాలేదు. ఎందుకంటే ఆ టైం లో నాన్నగారు రిటైర్మెంట్ స్టేజీలో ఉన్నారు.
35
నాగ చైతన్యతో కాంపిటీషన్
నేను నటిస్తుండగానే నాగ చైతన్య సినిమాల్లోకి వచ్చాడు. నాకు చైతన్యకి కాంపిటీషన్ అని చెప్పను కానీ.. ఇప్పటికీ నేను హీరోగా చేస్తున్నాను. నా ఏజ్ కి తగ్గ పాత్రలు వస్తున్నాయి. అయినప్పటికీ లిటిల్ బిట్ రొమాంటిక్ సీన్స్ కూడా దర్శకులు నా కోసం రాస్తున్నారు. నాగ చైతన్య తన ఏజ్ కి తగ్గ యంగ్ రోల్స్ చేస్తున్నాడు అని నాగార్జున తెలిపారు.
మీలో ఉన్నంత స్పార్క్ నాగ చైతన్యతో ఉందని భావిస్తున్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. నాగార్జున ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నా తొలి సినిమా తర్వాత నేను పనికి రాను అని చాలా మంది కామెంట్స్ చేశారు.
55
నాగ చైతన్యకి చాలా టైం ఉంది
నేను ఇన్నేళ్లల్లో తప్పుల నుంచి నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. నాగ చైతన్య ఇంకా యంగ్. కాబట్టి నేర్చుకోవడానికి చాలా టైం ఉంది అని నాగార్జున అన్నారు. నాన్న గారితో నటించిన సినిమాల్లో తనకు శ్రీరామదాసు అంటే చాలా ఇష్టం అని నాగార్జున తెలిపారు. ఆ మూవీలో నాన్నగారు చేసింది చిన్న రోల్ అయినప్పటికీ చాలా బావుంటుంది అని తెలిపారు.