Murali Mohan: చై సామ్ విడాకులు.. పని మనిషికి అంతా తెలుసు, ముందే తెలుసుంటే నాగార్జునతో చెప్పేవాడిని 

Published : Jul 20, 2022, 05:27 PM ISTUpdated : Jul 20, 2022, 05:28 PM IST

నాగ చైతన్య, సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారనేది ఎవరికీ తెలియని విషయం. కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టినా వాటిలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు. కాగా సీనియర్ నటుడు మురళీ మోహన్ సమంత, నాగ చైతన్య విడాకులు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
16
Murali Mohan: చై సామ్ విడాకులు.. పని మనిషికి అంతా తెలుసు, ముందే తెలుసుంటే నాగార్జునతో చెప్పేవాడిని 
Samantha-Naga Chaitanya

సమంత-నాగ చైతన్య లను  ఆయన దగ్గర నుండి చూశారు. వాళ్ళ వైవాహిక జీవితం గురించి మురళీ మోహన్ కి కొంత అవగాహన ఉంది. మురళీ మోహన్ కుటుంబం, నాగ చైతన్య దంపతులు ఓకే అపార్ట్మెంట్ లో ఉండడం వలన ఇంట్లో వారిద్దరూ ఎలా ఉంటారనేది ఆయనకు తెలుసట.

26
Samantha-Naga Chaitanya


నాగ చైతన్య, సమంత విడాకులు గురించి మురళీ మోహన్ మాట్లాడుతూ... హైదరాబాద్ లో మాకు ఓ అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ పైన మా కుటుంబం కోసం మూడు ఫెంట్ హౌసెస్ నిర్మించుకున్నాము. ఓ రోజు నాగ చైతన్య వాటిని చూశాడు. జిమ్, స్విమ్మింగ్ ఫూల్ లాంటి సౌకర్యాలతో ఉన్న ఆ పెంట్ హౌస్లు ఆయనకు నచ్చాయి. అందులో నాకు ఒకటి కావాలని చైతన్య అడిగాడు. అవి అమ్మడానికి కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కట్టించుకున్నవి అని చెప్పాను. 

36

నేను అమ్మనని చెప్పడంతో నాగార్జునతో నాకు చైతన్య ఫోన్ చేయించాడు. వాడికి ఏదీ ఒక పట్టాన నచ్చదండీ.. ఆ ఇల్లు కావాలి అంటున్నాడని నాగార్జున రిక్వెస్ట్ చేశారు. ఆయన స్వయంగా అడగడంతో కాదనలేకపోయాను. చివరికి మా అబ్బాయి కోసం కట్టిన ఇల్లు చైతూకి ఇచ్చాము. అప్పటికి ఆయనకు పెళ్లి కాలేదు. పెళ్ళయ్యాక సమంతతో పాటు అక్కడే ఉండేవాడు. 
 

46
Samantha Naga Chaitanya


సమంత, చైతూ చాలా  అన్యోన్యంగా ఉండేవారు. కలిసి జిమ్, వాకింగ్ చేసేవారు.   ఏనాడూ గొడపడినట్లు కూడా చూడలేదు. అలాంటి నాగ  చైతన్య, సమంత విడిపోతారని ఊహించలేదు. కొత్తగా ఇల్లు నిర్మించుకుటున్నాం పూర్తి కావడానికి ఏడాది సమయం పడుతుంది. అప్పుడు ఇక్కడి నుండి వెళ్లిపోతామని చైతన్య నాతో చెప్పాడు. ఈ లోపే వాళ్ళు విడాకులు తీసుకున్నారు. 
 

56

ఇంట్లో పని మనుషులకు మాత్రం ఈ విషయం ముందే తెలుసు. నాకు ఏమాత్రం తెలిసినా నాగార్జునకు చెప్పేవాడిని. కానీ అప్పటికే ఆలస్యమైంది. వాళ్లు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు, అని మురళీ మోహన్ తనకు తెలిసిన విషయాలు వెల్లడించారు. సమంత, నాగచైతన్య అధికారిక ప్రకటన చేయక మునుపే పుకార్లు చెలరేగాయి. 2021 అక్టోబర్ లో సోషల్ మీడియా వేదికగా సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

66

వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తుంది. విడాకులు ప్రకటించి నెలలు గడుస్తున్నా కోల్డ్ వార్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రొఫెషనల్  గా బిజీగా ఉన్న సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వార్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సమంత అసలు తగ్గడం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories