Babu Mohan: కమెడియన్ బాబు మోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవిని మొదటిసారి కలుసుకున్నప్పుడు ఆయన హీరో అని బాబు మోహన్ కి తెలియదట.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో చిన్న పాత్రల్లో సైతం నటించారు. అదే విధంగా చిన్న సినిమాల్లో హీరోగా చేస్తూ ఎదిగారు. కెరీర్ బిగినింగ్ స్టేజీలో ఉన్నప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణంలో కోతల రాయుడు అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో నటించారు.
25
చిరంజీవితో తొలి చిత్రం
బాబు మోహన్ చిరంజీవితో నటించిన తొలి చిత్రం కోతల రాయుడే. ఆ సినిమా షూటింగ్ లో చిరంజీవికి, బాబు మోహన్ కి మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. అప్పటికే చిరంజీవి కొన్ని చిత్రాల్లో నటించారు కానీ అంతగా గుర్తింపు రాలేదు. బాబు మోహన్ మాట్లాడుతూ.. నేను చిరు అన్నయ్యతో నటించిన తొలి చిత్రం కోతల రాయుడు. ఆ సినిమా షూటింగ్ కి వెళ్లే వరకు హీరో ఎవరో నాకు తెలియదు. చెట్టు కింద ఒక వ్యక్తి సామాన్యుడిలా నిలబడి ఉన్నాడు.
35
హీరో ఎవరు అని అడిగా
నేను అప్పుడే షూటింగ్ కి వెళ్ళాను. ఎవరో షూటింగ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు అయి ఉంటాడని అనుకున్నా. ఈ సినిమా హీరో ఎవరయ్యా అని ఆయన్ని అడిగా. ఆయన వెంటనే నేనే అని సమాధానం ఇచ్చారు. అప్పుడు కొంచెం క్లోజ్ గా గమనిస్తే ఈయన కొన్ని సినిమాల్లో నటించారు కదా అని గుర్తుకు వచ్చింది. వెంటనే థ్యాంక్యూ సార్ అని చెప్పి పక్కకు వెళ్ళాను.
ఆ మూవీలో ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో చిరు అన్నయ్య పెర్ఫార్మెన్స్ చూసి బాంచెత్ ఏం చేశాడ్రా.. ఇతనే ఫ్యూచర్ లో నెంబర్ 1 అని అనుకున్నా. నేను అనుకున్నట్లే జరిగింది అని బాబు మోహన్ తెలిపారు.
55
అలా పిలిస్తే అన్నం తిన్నట్లు ఉండదు
చిరంజీవి గారిని మీరు ఎప్పుడూ పేరు పెట్టి పిలవరట ఎందుకు అని ప్రశ్నించగా.. అవును నేను ఎప్పుడైనా ఆయన్ని చిరు అన్నయ్య అనే అంటాను. ఆయన్ని పేరు పెట్టి పిలిస్తే నాకు అన్నం తిన్నట్లు ఉండదు. ఎందుకో అలా అలవాటు అయింది అని బాబు మోహన్ తెలిపారు.