శేఖర్‌ మాస్టర్‌ పెద్ద కళాకారుడే.. అందరి ముందు యాంకర్‌ రష్మితో సరసం.. ఆయన టాలెంట్‌ని ఇంద్రజ బయటపెట్టడంతో గోల

First Published | Feb 19, 2024, 11:54 AM IST

జబర్దస్త్ రష్మి, సుడిగాలి సుధీర్‌ కాంబినేషన్‌కి సెపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. చాలా రోజులుగా వీరిద్దరి మధ్య గ్యాప్‌ వచ్చింది. దీంతో రష్మి వద్ద శేఖర్‌ మాస్టర్‌ టాలెంట్ చూపిస్తున్నాడు.
 

యాంకర్‌ రష్మి క్రేజ్‌ మామూలు కాదు. ఆమె జబర్దస్త్ యాంకర్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. బుల్లితెరని ఊపేస్తుంది. పదేళ్లుగా అంత్యంత విజయవంతంగా రాణిస్తుంది. ఆ క్రేజ్‌కి కారణం ఆమె అందంతోపాటు అభినయం కూడా అని చెప్పొచ్చు. 
 

రష్మి, సుడిగాలి సుధీర్‌ మధ్య చాలం మంచి బాండింగ్‌ ఏర్పడింది. స్టేజ్ పై లవర్స్ గా చెలామణి అయ్యారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అది జబర్దస్త్ షోకి టీఆర్‌పీ రేటింగ్‌ తేవడంలో సక్సెస్‌ అయ్యింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చింది. ఆల్మోస్ట్ ఏడాదిన్నరగా ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. సుధీర్‌ జబర్దస్త్ మానేయడంతో ఆ గ్యాప్‌ వచ్చింది. ఆయన హీరోగా బిజీగా ఉన్నాడు. రష్మి బుల్లి తెరపై రచ్చ చేస్తూనే ఉంది. అవకాశాలు వస్తే వెండితెరపై కూడా మెరుస్తుంది.
 


ఇదిలా ఉంటే చాలా కాలంగా సుధీర్‌, రష్మి కలిసి లేకపోవడంతో ఈ ఇద్దరి అభిమానులు ఫీల్‌ అవుతున్నారు. నిరాశ చెందుతున్నారు. ఇద్దరు కలవాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో టీవీ షోస్‌లోనూ ఆ వెలితి కనిపిస్తుందంటూ తరచూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ సుధీర్‌ రావాలని కోరుకుంటున్నారు. కానీ ఒంటరిగానే జబర్దస్త్ ని డీల్‌ చేస్తుంది రష్మి. తనవంతుగా అలరించే ప్రయత్నం చేస్తుంది.
 

అయితే ఇప్పుడు రష్మితో శేఖర్‌ మాస్టర్‌ పులిహోర కలపడం ఆశ్చర్యంగా మారింది. రష్మి ఎలాగూ సింగిల్‌గానే ఉంది, దీంతో శేఖర్‌ మాస్టర్‌ అడ్వాంటేజ్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తాజాగా `శ్రీదేవి డ్రామా కంపెనీ` ప్రోమోలో రష్మితో పులిహోర కలుపుతూ దొరికిపోయాడు. అంతేకాదు అటు ఇంద్రజ, ఇటు రామ్‌ ప్రసాద్‌ లు సైతం దాన్ని కని పెట్టి వెంటనే సెటైర్లతో విరుచుకుపడ్డారు. 
 

తాజాగా `శ్రీదేవి డ్రామా కంపెనీ` ప్రోమో విడుదలైంది. శేఖర్‌ మాస్టర్‌ మొదటి సారి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాడు. రావడం రావడంతో పులిహోర స్టార్ట్ చేశాడు. కానీ రష్మి..రోజు రోజుకి అందం పెరుగుతుంది, నాకు అర్థం కావడం లేదు` అంటూ రష్మిపై చేయి వేశాడు శేఖర్‌ మాస్టర్‌. 
 

దీనికి సిగ్గులతో ముగ్గులేసింది రష్మి. ఓ రేంజ్‌లో వెలిగిపోయింది. ఏకంగా డాన్సులు కూడా వేసింది. శేఖర్‌ మాస్టర్‌ పొగడ్తలకు ఊగిపోయింది జబర్దస్త్ యాంకర్‌. దీంతో మధ్యలో కల్పించుకుని `సర్‌ మీరు చేయి వదలండి ఫస్ట్ అంటూ` రామ్‌ ప్రసాద్‌ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే రష్మి చేయి వదిలేశాడు శేఖర్‌ మాస్టర్‌. 
 

దీనిపై జడ్జ్ ఇంద్రజ స్పందించింది. డాన్సర్‌ భూమికని పట్టుకుని `భూమిక ఏంటమ్మ ఈ టాలెంట్‌ మీ మాస్టర్‌ కే తెలియాలి` అని పంచ్‌లు వేసింది. దీంతో శేఖర్‌ మాస్టర్‌కి ఫ్యూజులు ఔట్‌ అయ్యాయి. నవ్వులతో కవర్‌ చేసుకున్నారు. కానీ ఏంటి మేడం టాలెంట్‌ అంటున్నారని అడగ్గా, నేను అన్నది భూమిక డాన్స్ టాలెంట్‌ గురించి, మీరు అంటున్న టాలెంట్‌ ఏంటో నాకు తెలియదు అంటూ మరోసారి పంచ్‌ విసిరింది ఇంద్రజ. దీంతో మరోసారి రచ్చలేచిపోయింది.

దీనికి ఆయన రియాక్ట్ అవుతూ డాన్సు గురించి అయితే అందరికి తెలుసు, భూమిక బాగా చేస్తుందని అన్నాడు. దీనికి రష్మి చెబుతూ, నేను అదే చెబుతున్నా మాస్టర్‌ అంటూ రియాక్ట్ అయ్యింది. మరి వాళ్లంతా ఎందుకు అరుస్తున్నారని శేఖర్‌ మాస్టర్‌ అడగ్గా, `టాలెంట్` గురించి అని రష్మి చెప్పడంతో షో మొత్తం హోరెత్తిపోయింది. కామెడీగా చేసిన ఈ సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ప్రోమో యూట్యూబ్‌లో రచ్చ చేస్తుంది. ఇది వచ్చే ఆదివారం ఈటీవీలో ప్రసారం కానున్న విషయం తెలిసిందే. 
 

Latest Videos

click me!