Savitri: సావిత్రి ప్రేమగా బావా అని పిలిచే స్టార్‌ ఎవరో తెలుసా? ఆయనతో మహానటి రిలేషన్‌ స్పెషల్‌

Published : Apr 23, 2026, 05:22 PM IST

Savitri: మహానటి సావిత్రి మనుషులకు ప్రయారిటీ ఇచ్చేది. అయితే ఇండస్ట్రీలో ఒక స్టార్‌ని మాత్రం ఆమె బావా అని పిలిచేదట. సెట్‌ లో ఆటపట్టించేదట. జమున ఈ విషయాన్ని పంచుకుంది. 

PREV
15
అద్భుతమైన నటనకు కేరాఫ్‌ సావిత్రి

మహానటి సావిత్రి మన నుంచి దూరమై 45ఏళ్లు అవుతుంది. దాదాపు 30 ఏళ్లు తిరుగులేని స్టార్‌ గా వెలిగిన ఆమె తెలుగు,తమిళంలో తన మార్క్ ని చూపించారు. అద్భుతమైన నటనతో మెప్పించారు. ఇప్పటికీ తన సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. తన జీవితం ఎంతో మందికి గుణపాఠంగా నిలిచింది. అదే సమయంలో ఆమె ఆదర్శంగా నిలిచారు. సావిత్రి ఇప్పుడు మన మధ్య లేకపోయినా తన సినిమాలతో మనచుట్టూనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది.

25
దారుణమైన పరిస్థితులు ఫేస్‌ చేసిన సావిత్రి

మహానటి సావిత్రి.. తమిళ నటుడు జెమినీ గణేషన్‌ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జెమినీ గణేషన్‌కి అప్పటికే పెళ్లి అయినా కూడా సావిత్రి వెనక్కి తగ్గలేదు. ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. కానీ జెమినీ గణేషన్‌కి ఉన్న ఇతర ఎఫైర్స్ కారణంగా ఆమె బాధపడ్డారు. కుంగిపోయారు. దీంతో తాగుడికి బానిస అయ్యారు. అదే సమయంలో నిర్మాతగా లాస్‌ అయ్యారు. దర్శకురాలిగా ఫెయిల్‌ అయ్యారు. నమ్మినవాళ్లు మోసం చేశారు. ప్రభుత్వం ఆస్తులు జప్తు చేసింది. ఐటీ దాడులు ఇలా అన్నీ సావిత్రిని వెంటాడాయి. దీంతో వాటిని తట్టుకోలేక తాగుడికి బానిసై ఆ తర్వాత కోమాలోకి వెళ్లి మరణించారు. 

35
ఏఎన్నార్‌ని గురువుగా భావించిన సావిత్రి

ఇదిలా ఉంటే సావిత్రి తన చుట్టూ ఉన్న వాళ్లని ఎంతో బాగా చూసుకున్నారు. తనని నమ్మిన వాళ్లకి ఏదైనా చేసేవారు. చేయి చాచి అడిగిన వారికి కాదనకుండ సహాయం చేశారు. అయితే సావిత్రికి ఏఎన్నార్‌ అంటే ఇష్టం. ఆయన్ని ఆరాధించేవారు. ఆయన్ని గురువుగా భావించే వారట. గురువు అని పిలిచేదట. కానీ ఇండస్ట్రీలో ఒక్కరిని మాత్రం సావిత్రి `బావా` అని పిలిచేది. ఆయన ఎవరనేది ఆసక్తికరం.

45
సావిత్రి బావా అని పిలిచేది జగ్గయ్యని

సావిత్రి ప్రేమతో బావా అని పిలిచేది నటుడు జగ్గయ్యని. ఆయన్ని సెట్‌లో `బావా.. బావా` అని పిలుస్తూ ఆటపట్టించేవారట. సెట్‌లో సావిత్రి చాలా సందడిగా, గోల గోలగా, చలాకీగా ఉండేదట. ఈ విషయాన్ని సీనియర్‌ నటి జమున వెల్లడించారు. మహానటి సినిమా సమయంలో ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు. అయితే జగ్గయ్యని బావా అని పిలవడానికి పెద్ద కారణమే ఉంది. సావిత్రికి సినిమాలకు రాకముందు నుంచి జగ్గయ్య పరిచయం. వీరిద్దరు కలిసి నాటకాలు వేసేవారట. అలా నాటకాల నుంచి బావా బావా అని పిలవడం ఆలవాటు అయ్యిందని, అలానే పెద్దయ్యాక కూడా ఆటపట్టిస్తుందని జమున చెప్పారు.  జగయ్య అప్పట్లో హీరోగానూ నటించి మెప్పించారు. స్టార్‌ గా రాణించారు. 

55
సావిత్రితో అనుబంధాన్ని పంచుకున్న జమున

 ఈ సందర్భంగా సావిత్రితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు జమున. సావిత్రి నాటకాలు వేసినప్పుడు జమున వాళ్ల ఊరికి వెళ్లారట. ఆ సమయంలో వాళ్లింట్లోనే రెడీ అయ్యేవారని చెప్పారు. ఆ తర్వాత జమున హీరోయిన్‌గా పరిచయం అయినప్పుడు తనని గుర్తు పట్టి ఇంటికి పిలిపించి మర్యాదలు చేసిందని, పెళ్లికి వచ్చి ఆశీర్వదించిందని తెలిపారు. కొడుకు పుట్టినప్పుడు కూడా వచ్చారట. ఇలా తనని చెల్లీ చెల్లీ అంటూ ఆప్యాయంగా పిలిచేదని, సొంత చెల్లిలా చూసుకునేదని, అలాంటి మనిషిని చివరి రోజుల్లో ఆసుపత్రి బెడ్‌పై చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిపారు జమున. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories