వెండితెరపై మహారాణిలా వెలుగు వెలిగింది సావిత్రి. హీరోలను మించిన స్టార్ డమ్, సంపాదన ఆమెను మంచెత్తాయి. ఆతరువాత కాలంలో ఆస్తులు పొగొట్టుకుని.. అనారోగ్యంతో కన్నుమూసింది. ఓ సారి షూటింగ్ కి సావిత్రి తాగి వస్తే ఏం జరిగిందో తెలుసా?
మహానటి సావిత్రి తెలుగు సినిమాకు ఒక బ్రాండ్. నేటితరం హీరోయిన్లకు ఆదర్శం.. ఆమె మరణం తరువాత వందల మంది హీరోయిన్లు తెలుగుతెరపై మెరిశారు. కానీ సావిత్రిని మించి నటించగలిగే వారు మాత్రం ఇంత వరకూ రాలేదు. సౌందర్య, స్నేహా లాంటి హీరోయిన్లు్ సావిత్రిలా అనిపించినా.. ఆమెను మించిన అద్భుతాలు మాత్రం ఎవరు చేయలేకపోయారు. ఇప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకులు హృదయాలలో సావిత్రి స్థానం మాత్రం పదిలంగా అలానే ఉంది. ఆమె మరణించి 40 ఏళ్ళకు పైగా అవుతున్నా.. ఆమెను తమ మనసుల్లో పదిలపరుచుకున్నారు ప్రక్షకులు.
27
సావిత్రి జీవితంలో ఎన్నో కష్టాలు..
హీరోయిన్ గా వెలుగు వెలిగిన సావిత్రి.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో దెబ్బలు తిన్ననది. జీవితం సాఫీగా సాగిపోతున్న టైమ్ లోనే.. జెమినీ గణేషన్ తో రహస్య వివాహం.. ఇద్దరు పిల్లలు, భర్తతో విభేదాలు, కోట్ల ఆస్తులు ఒక్కసారిగా కరిగిపోవడం, సావిత్రి సాయం అందుకున్నవారు ఆమెకు వెన్నుపోటు పోడవడం, పక్కనే ఉంటూ ఎంతో మంది ఆమెను మోసం చేయడంతో.. ఉక్కిరిబిక్కిరి ఆయిపోయింది మహానటి. ఆ ఇబ్బందులు ఆమెను ఆల్కాహాల్ కు బానిసను చేశాయి. ఎక్కువగా తాగడంతో ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆస్తులన్నీ పోగోట్టుకుని చివరకు చిన్న ఇంట్లో ఎన్నో కష్టాలు పడింది సావిత్రి.
37
మహానటికి మందు అలవాటు చేసింది ఎవరు?
సావిత్రికి స్వతహాగా తాగే అలవాటు లేదు.. కానీ ఆమో ఇబ్బందులు, ఒత్తిడిని ఆసరాగా చేసుకుని కొంతమంది ఆమెను తాగేలా ప్రోత్సహించినట్టు సమాచారం. ఘగర్ వ్యాధి ఇబ్బంది పెట్టడంతో కొన్నాళ్లు తాగటం మానేసినా.. ఆతరువాత మళ్లీ మొదలు పెట్టక తప్పలేదట. కొన్ని సార్లు ఆమె షూటింగ్స్ కి కూడా తాగి వచ్చేవారని తెలుస్తోంది. హీరోయిన్ గా అవకాశాలు పోయి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సావిత్రి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. శోభన్ బాబు తల్లి, వదినగా కొన్ని సినిమాల్లో ఆమె నటించింది. అయితే విచిత్ర దాంపత్యం సినిమా షూటంగ్ టైమ్ లో సావిత్రి ఫుల్ గా తాగి సూటింగ్ కు వెళ్లారట.
విచిత్ర దాంపత్యం సినిమాలో శోభన్ బాబు హీరో కాగా, విజయ నిర్మల హీరోయిన్ గా నటించింది. గుమ్మడి భార్యగా సావిత్రి నటించారు. ఈ సినిమా షూటింగ్ కు బాగా ఆల్కాహాల్ తీసుకునివెళ్లిన సావిత్రి.. సెట్ కు వెళ్లగానే వాంతి చేసుకున్నారట. దాంతో వెంటనే అక్కడే ఉన్న విజయ నిర్మల సావిత్రిని మేకప్ రూమ్ లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారట.
57
సావిత్రి మంచితనం ముంచింది..
సావిత్రి లేనిదే ఆ సీన్ షూటింగ్ చేయడం కుదరు కాబట్టి.. డైరెక్టర్ షూటింగ్ కు పేకప్ చేప్పబోతుండగా.. తాను అర్ధగంటలో మళ్లీ వచ్చి షూటింగ్ లో జాయిన్ అవుతానని సావిత్రమ్మ కబురు పెట్టారట. అలా తన పనిలో మాత్రం ఏ లోటు రాకుండా, నిర్మాతకు, దర్శకుడికి ఇబ్బందులు కలగకుండా చూసుకునేవారు సావిత్రి. ఈ విషయాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ వెండి వెన్నెల యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు.
67
14 నెలలు నరకం చూసిన మహానటి..
సావిత్రి జీవితంలో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమెను కష్టాల్లోకి నెట్టాయి. నిండా ముంచాయి. మనుషులను అతిగా నమ్మి మొుసపోయింది మహానటి. సాయం అని వచ్చినవారికి లేదనకుండా దానం చేసి.. చివరకు తనకు ఏమీ లేకుండా చేసుకుంది. కోట్లలో సంపాదించిన సావిత్రి.. ఆస్తులను కాపాడుకోలేకపోయింది. మహారాణిలా బ్రతికిన ఆమె.. చివరకు నా అన్నవారు చుట్టు లేకుండా 14 నెలలు కోమాలో నరకయాతన అనుభవించి 47 ఏళ్ల చిన్న వయసులో కన్నుమూసింది.
77
పంటించుకోని ఫిల్మ్ ఇండస్ట్రీ..
సావిత్రి 1981 డిసెంబర్ 26న మరణించింది. ఆమె అంత పెద్ద నటి, మహానటిగా పేరుంది. ఎంతో మందికి భిక్షపెట్టింది. ఎంతో మంది జీవితాలు బాగు చేసింది. కానీ ఆమె మరణిస్తే ఎవరు పట్టించుకోలేదు. ఆమె సాయం పొందినవారు కూడా తిరిగి చూడలేదు. అంత్యక్రియలకు కూడా ఇండస్ట్రీ నుంచి ఏఎన్నార్, దాసరి, మురళీ మోహన్ మాత్రమే హాజరయ్యారు. కొంత మంది జూనియర్ ఆర్టిస్ట్ లు.. ఆమె ఇంటి చుట్టు ఉన్న బస్తీ వాసులు తప్పించి ఎవరు రాలేదని మురళీ మోహన్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు.