కథేంటి;తన భార్య పద్దు (రోషిని ప్రకాష్)ఆత్మహత్యతో, వైజాగ్ సిటీ ఏసీపి సత్య(సత్యదేవ్) డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. తను చేస్తున్న జాబ్ పై కూడా ఫోకస్ పోగొట్టుకుంటాడు.తాగుబోతుఅవుతాడు. ఈ క్రమంలో తన తోటి ఆఫీసర్ విషయంలో చేసిన పొరపాటుతో డిపార్టమెంట్ అతన్ని ఆర్నెళ్ల పాటు సస్పెండ్ చేస్తుంది. ఈ క్రమంలో మరింతగా భార్య జ్ఞాపకాలు వెంబడిస్తుంటాయి. భార్య చనిపోయిన బాధకు తోడు ఆమె ఆత్మహత్యకు కారణమేంటో తెలియక సతమతమవుతుంటాడు సత్య. ఈ క్రమంలో ఓ రోజు అతని కోలీగ్ రవి (రవి వర్మ) ఓ కేసు విషయంమై అతనితో డిస్కస్ చేస్తాడు. అది ఓ సూసేడ్ కేసు.
అయితే భార్య చనిపోయిన రోజే ఫార్మా ఇండస్ట్రలియిస్ట్ శ్రీనివాస్ సూసైడ్ చేసుకుంటాడు. ఆ కేసు అనుమానాస్పదంగా కనిపిస్తుంది సత్యకు. శ్రీనివాస్ ఆత్మహత్యకి పద్దూ ఆత్మహత్యకి సంబంధం ఉందేమోనని ఆ యాంగిల్ లో కేసుని సొంతంగా ఇన్విస్టిగేషన్ చేయటం మొదలెడతాడు. ఈ క్రమంలో అనేక నిజాలు బయిటకు వచ్చి సత్యకు షాక్ ఇస్తాయి. ఆ విషయాలు ఏమిటి... అసలు బయిటపడ్డ ఆ నిజాలేంటి, పద్దు ఆత్మహత్య వెనక ఉన్న మిస్టరీ ఏమిటి, మిస్టీరియస్ గర్ల్ జూలియట్ (పూజ జవేరీ) ఎవరు... 47 రోజుల సంకేతం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.
ఎలా ఉంది;స్టోరీ లైన్ గా వింటానికి ఇంట్రస్టింగ్‌గా అనిపించే ఈ కథ స్క్రిప్టు గా మారే ట్రీట్మెంట్ దశలో దిస కోల్పోయింది. ఈ సినిమాని ఒకే థ్రెడ్ మీద నడిపితే బాగుండేది.థ్రెడ్స్ ఎక్కువై అసలు చెప్దామనుకున్న కథ మరుగన పడింది. ఏదో థ్రిల్లర్ చూస్తున్నాం కదా అనుకుంటే ఎమోషనల్ లింకు లేకపోతే పండదు అనుకుని ఆ సీన్స్ పెట్టి, థ్రిల్ ని మిస్ చేశాడు.పద్దు ఆత్మహత్యతో మొదలైన ఈ కథ... కొంతదూరం వెళ్లేసరికి ఎటు నుంచి ఎటో వెళ్లిపోతుంది. సబ్ ప్లాట్స్ ఓపెన్ అవుతూ మెయిన్ కథపై ఫోకస్ తగ్గించేస్తుంది. ఆ విషయం దర్శకుడుకి క్లైమాక్స్ వచ్చే వరకూ గుర్తుకు రానట్లుంది. అప్పుడు ఏం చేసినాఫలితం లేకుండా పోయింది.
మిస్టీరియస్ గర్ల్ గా జూలియట్ పాత్రని బాగా డిజైన్ చేసారు. సెకండాఫ్ కు ఈ పాత్రే బేస్ అయ్యింది. కానీ ఆ పాత్ర పెద్దగా కథలో ఇంపాక్ట్ తేలేకపోయింది. దీనికి తోడు చాలా చోట్ల సినిమా అసహజంగా ఉంటుంది. డైరక్టర్సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నాడు. ఎప్పుడో ఏడో తరగతిలో జరిగిన ఓ సంఘనటను తీసుకొచ్చి మధ్యలో కలుపుతాడు. వీటిన్నటితో థ్రిల్ మిస్ అయ్యింది. నిడివి పరంగానూ జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
ఈ లోపాలతో ఇంట్రస్ట్ మొదలైంది.. కథ పరుగెడుతుందని మనం భావించే చోట నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యదు. మిస్టీరియస్ గర్ల్ జూలియట్ పాత్ర ఏదో ఉంది... ఇదే కథను మలుపుతిప్పుతుంది అని ఆసక్తిగా చూస్తూంటే... దాన్ని కొనసాగనివ్వరు. జూలియట్ ఎంట్రీ కథ సడెన్ గా డ్రగ్స్ వైపు తిరుగుతుంది. ఇలా కథని షాకింగ్ ట్విస్ట్ లతో మలుద్దామనుకున్నాడు దర్శకుడు. కానీ ట్విస్ట్ అనుకున్నవి ఏమీ పేలలేదు. రెండు వేర్వేరు థ్రెడ్స్ ని ముడిపెట్టి ఈ థ్రిల్ ని పండిద్దామనుకున్నారు. కానీ ఇల్లాజికల్ సీన్స్ ఆ అవకాసం ఇవ్వలేదు. ఎక్కడా మనం థ్రిల్ అవ్వము.
దర్శకత్వం, మిగతా విభాగాలు;ఈ సినిమాతో పరిచయమైన దర్శకుడు ప్రదీప్.. పూరి జగన్నాథ్ స్కూల్ నుంచి వచ్చాడు. అయితే తన గురువుకు ఉన్న స్క్రీన్ ప్లే స్పీడు ఎక్కడా వంటబట్టించుకోలేదు. అయితే సినిమా ప్రారంభం నుంచి ముందు ఏదో జరగబోతోందనే ఆసక్తిని మాత్రం కల్గించగలిగాడు. అయితే అనుభవం ఉన్న డైరక్టర్ చెయ్యాల్సిన సినిమా ఇది.ఇక రాసుకున్న ట్విస్ట్ లు అన్ని మనకు ముందే తెలిసిపోతూంటాయి. హీరో కన్నా ముందే మనం ఊహించగలిగేయటం ఈ సినిమా స్పెషాలిటి.
సంగీతం విషయానికి వస్తే రఘు కుంచె... బెస్ట్ ఇద్దామనే ప్రయత్నించారు. అక్కడక్కడా హిందీ, ఇంగ్లీష్ లిరిక్స్ తో అలరించాడు. అయితే సినిమా కన్నా మ్యూజిక్ స్టాండర్డ్ ఎక్కువై, సింక్ అవ్వలేదు. పాటలు... కర్సర్ ని ముందుకు తోసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ఈ సినిమాని ఇంకాషార్ప్ గా కట్ చేసి ఉంటే చూసిన వారు ధాంక్స్ చెప్పుకుందురు. మిగతా విభాగాలు సినిమాకు తగ్గ స్టాండర్డ్స్ లో ఉన్నాయి.
నటీనటుల్లో సత్యదేవ్....సినిమా సినిమాకు తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఈ సినిమాని ఆ మాత్రం అయినా భరించగలిగామంటే అతని ప్రతిభే. రోషిణి ప్రకాష్, పూజ జవేరి చూడ్డానికి బాగున్నారు. ఫెరఫార్మెన్స్ వైజ్ కూడా బాగానే చేసారు. కానీ కథే వాళ్లకు సహకరించలేదు. రవి వర్మ ఓకే. హరి తేజ పెద్దగా ఉపయోగపడలేదు.
ఫైనల్ థాట్;ఇంకో ఓటీటి సినిమా వచ్చింది అంతే.Rating: 25---సూర్య ప్రకాష్ జోశ్యులతెరవెనక..ముందు;నటీనటులు : సత్యదేవ్, పూజా జవేరి, రోషిని,రవి వర్మ, హరి తేజ తదితరులుసంగీతం : రఘు కుంచెసినిమాటోగ్రఫర్ : జి.కే ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రదీప్ మద్దాలినిర్మాతలు : శశి భూషణ్, రఘు కుంచె, శ్రీశర్,విజయ్ శంకర్