ఇక బిగ్ బాస్ తర్వాత బింధు మాధవికి సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి అని అనుకున్నారు ఫ్యాన్స్. హౌస్ లో ఉండగానే అనిల్ రావిపూడి- బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో బింధుకి ఇంపార్టెంట్ రోల్ దక్కుతుంది అనుకున్నారు. కాని ప్రతీ సారి మాదిరిగానే ఈసారి కూడా జరిగింది. బిగ్ బాస్ నుంచి వెళ్ళిన వారికి ఇండస్ట్రీలో లైఫ్ ఉండటంలేదు. బింధు మాధవికి కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.