స్టార్ డైరెక్టర్ రాజమౌళికే సాధ్యం కానిది, చేసి చూపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Published : May 05, 2022, 04:32 PM IST

టాలీవుడ్ ను హలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్ళిన డైరెక్టర్ రాజమౌళికి కూడా సాధ్యం కాని పనిని చేసి చూపించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సర్కారువారి పాట సినిమా కోసం సరికొత్త ప్రమోషనల్ ట్రిక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.   

PREV
16
స్టార్ డైరెక్టర్ రాజమౌళికే సాధ్యం కానిది, చేసి చూపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు

సాధారణంగా సినిమా ప్రమోషన్ అంటే రకరకాలుగా చేస్తారు. గతంలో పోస్టర్స్ మీద మాత్రమే ఆధారపడేవారు. కాని ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తరువాత రకరకాలుగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇక ఈసారి అంతకు మంచి అన్నటు చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారి పట ప్రమోషన్స్ ను.  
 

26

వందల కోట్ల బడ్జెట్ తో.. స్టార్ కాస్ట్ తో వరల్డ్ బెస్ట్ సినిమాలు తెరకెక్కి్స్తున్న టాలీవుడ్ జక్కన్న రాజమౌళికి కూడా సాధ్యం కాని విధంగా.. ప్రమోషన్స్ లో సరికొత్త ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు సర్కారువారి పాట టీమ్. సినిమా రీచ్ ను పెంచేందుకు ఫ్యాన్స్, ఆడియెన్స్ కోసం సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ను రివీల్ చేశారు మేకర్స్.

36

సాధారణంగా ట్విటర్ లో హ్యాష్ ట్యాగ్స్ కామన్ గా ఉంటాయి. అయితే సర్కారు వారి పాట  సినిమా హ్యాష్ ట్యాగ్ పై  మాత్రం మహేశ్ బాబు స్పెషల్ ఎమోజీని తీసుకొచ్చారు టీమ్. ఈ ఎమోజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో  ట్రెండ్ అవుతోంది.
 

46

ట్విట్టర్ లో ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ పై మహేష్ బాబు స్పెషల్ ఎమోజిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది ట్విట్టర్ లో యాక్టీవ్ కూడా అయ్యిపోయింది. మొత్తం మూడు ట్యాగ్స్ లో ఈ ఎమోజి కనిపిస్తుండగా ఇప్పుడు ఇది ట్రెండింగ్ గా మారిపోయింది. మొత్తానికి మన టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ని సర్కారు వారి పాట స్టార్ట్ చేసింది అని చెప్పాలి.
 

56

గతంలో రాజమౌళి టీమ్ కూడా ఇలా హ్యాష్ ట్యాగ్ పై స్పెషల్ ఎమోజీలు తీసుకురావాలని చాటా ట్రై చేశారు. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కూడా ఇలానే చేయాని అనుకున్నారు. కాని అది సాధ్య పడలేదు. కాని టాలీవుడ్ లో ఈరకంగా హ్యాష్ ట్యాగ్స్ పై ఎమోజీలను జత చేసి ప్రమోషన్ చేసే ట్రెండ్ ను జక్కన్న మిస్ అయితే.. మహేష్ బాబు మాత్రం అంది పుచ్చుకున్నాడు. 

66

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ అవుతోంది. ఇక సర్కారువారి పాట రిలీజ్ కు ముస్తాబు అవుతోంది. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటించింది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలజ్ కాబోతున్న ఈమూవీ ప్రీ రిలీజ్ ను ఈనెల 7న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. 

click me!

Recommended Stories