రమాప్రభకి 60 కోట్ల ఆస్తి ఇచ్చా.. హీరోయిన్లే వెంటపడుతున్నా ఆమెతో వయసులో తప్పు చేశానన్న శరత్ బాబు

Published : May 22, 2023, 02:50 PM IST

నటుడు శరత్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, ప్రతి నాయకుడిగా వెండి తెరపై ఎన్నో పాత్రలకు జీవం పోశారు. దాదాపు ఐదు దశాబ్దాలు నటుడిగా ప్రస్థానం కొనసాగించిన శరత్ బాబు నేడు తన జీవిత ప్రస్థానాన్ని కూడా ముగించారు.

PREV
16
రమాప్రభకి 60 కోట్ల ఆస్తి ఇచ్చా.. హీరోయిన్లే వెంటపడుతున్నా ఆమెతో వయసులో తప్పు చేశానన్న శరత్ బాబు
sarath babu

నటుడు శరత్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, ప్రతి నాయకుడిగా వెండి తెరపై ఎన్నో పాత్రలకు జీవం పోశారు. దాదాపు ఐదు దశాబ్దాలు నటుడిగా ప్రస్థానం కొనసాగించిన శరత్ బాబు నేడు తన జీవిత ప్రస్థానాన్ని కూడా ముగించారు. అనారోగ్యంతో భాదపడుతున్న శరత్ బాబు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితమే శరత్ బాబు మరణించినట్లు పుకార్లు వచ్చాయి. కానీ కుటుంబ సభ్యులు ఖండించారు. కాగా నేడు శరత్ బాబు ఆరోగ్యం విషమించడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు.  

26
sarath babu

శరత్ బాబు 1973లోనే నటుడిగా మారారు. రామరాజ్యం అనే చిత్రంలో తొలిసారి నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాందవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన మెప్పించారు. శరత్ బాబు నటనా జీవితం తిరుగులేని విధంగా సాగింది. 

36

కానీ ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాలతో సాగింది. 1981లో శరత్ బాబు సీనియర్ నటి రమాప్రభని ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. ఇప్పటికి రమాప్రభ పలు ఇంటర్వ్యూలలో శరత్ బాబుని తీవ్రంగా విమర్శిస్తూ తనకి జరిగిన అన్యాయం తలచుకుని బాధపడుతూ ఉంటుంది. శరత్ బాబు వ్యక్తిత్వాన్ని దూషిస్తూ ఉంటుంది. అయితే ఈ వివాదంలో శరత్ బాబు కూడా తన వర్షన్ వినిపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

46

శరత్ బాబు తన ఆస్తులని కాజేశాడు అని రమాప్రభ పలు సందర్భాల్లో ఆరోపించారు. కానీ శరత్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రమాప్రభకి రూ 60 కోట్ల ఆస్తి ఇచ్చానని అన్నారు. మీరంతా నన్ను విమర్శిస్తున్నారు. కానీ నేను అప్పట్లో నా ఆస్తి అమ్మి రమాప్రభ పేరు మీద ఒక ప్రాపర్టీ, ఆమె తమ్ముడి పేరుమీద మరొకటి, ఇద్దరి పేరుమీద మరొకటి ఇలా మూడు ప్రాపర్టీలు కొనిచ్చానని తెలిపారు. 

56

రమాప్రభకి నాకు తెలిసిన బంధువు ఆమె తమ్ముడు మాత్రమే. నా కార్ డ్రైవ్ చేస్తూ నాతో తిరిగేవాడు. అతడొక ఉమెనైజర్ అని అర్థం వచ్చేలా శరత్ బాబు ఆరోపణలు చేశారు. ఇక శరత్ బాబు రమాప్రభతో పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు. అప్పట్లో శరత్ బాబుకి హ్యాండ్సమ్ పర్సన్ గా చాలా మంది హీరోయిన్లలో కూడా ఫాలోయింగ్ ఉండేది. శరత్ బాబుని కొందరు హీరోయిన్లు ప్రేమించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంత మంది హీరోయిన్లు వెంటపడినప్పటికీ మీరు రమాప్రభని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. శరత్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

66

ప్రజలందరికి తెలియడం కోసం చెబుతున్నా. అప్పట్లో నా వయసు 22 ఏళ్ళు. రమాప్రభ నాకంటే వయసులో 7 ఏళ్ళు పెద్దది. ఫ్రెష్ గా కాలేజీ నుంచి, మంచి ఫ్యామిలీ నేపథ్యం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చా. ప్రపంచం గురించి తెలియని వయసులో ఆమెతో పరిచయం ఏర్పడింది. అలా ప్రపంచం తెలియని వయసులో పొరపాటు చేయడం నేను చేసిన తప్పు. ఆ వయసులో ఎలాంటి అనుభవం లేకుండా ఆ తప్పు చేశా. అది నా దృష్టిలో పెళ్లి కూడా కాదు.. ఒక కలయిక అంతే అంటూ శరత్ బాబు రమాప్రభ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 

click me!

Recommended Stories