సాయి పల్లవిని చూడగానే ఏడ్చేసిన సరళ తల్లి.. ఆమె కుటుంబాన్ని కలిసిన ‘విరాటపర్వం’ టీమ్..

Published : Jun 13, 2022, 07:41 PM IST

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి, రానా జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’.  ఈ చిత్రంలో పల్లవి.. అభ్యుదయవాది సరళ పాత్రను పోషించింది. తాజాగా  చిత్ర యూనిట్ సరళ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కలిసింది.

PREV
16
సాయి పల్లవిని చూడగానే ఏడ్చేసిన సరళ తల్లి.. ఆమె కుటుంబాన్ని కలిసిన ‘విరాటపర్వం’ టీమ్..

దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్ర 'విరాటపర్వం' (Virata Parvam). ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవలె చిత్ర ట్రైలర్ ను వరంగల్ లో  నిర్వహించిన ‘విరాట పర్వం ఆత్మీయ వేడుక’లో రిలీజ్ చేశారు. 
 

26

నక్సలిజం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా రవన్న పాత్రను పోషించాడని తెలుస్తోంది.  అలాగే భరతక్క పాత్రలో ప్రియమణి నటించిందని సమాచారం. కాగా సాయి  పల్లవి మాత్రం ఈ చిత్రంలో ‘వెన్నెల’ పాత్రలో కనిపించనుంది.  ఈ వెన్నెలే నిజ  జీవితంలో వరంగల్ కు  చెందిన అభ్యుదయవాది సరళ అని తెలుస్తోంది.
 

36

తాజాగా  విరాట పర్వం చిత్ర యూనిట్, సాయి పల్లి, రానా దగ్గుబాటి వరంగల్ లోని సరళ నివాసానికి వెళ్లారు. అక్కడ సరళ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిశారు. ఈ సందర్భంగా ‘విరాటపర్వం’ చిత్ర యూనిట్ కు సరళ కుటుంబీకులు ఘనంగా స్వాగతం పలికారు. సరదాగా కాసేపు మాట్లాడారు. అలాగే సరళ గురించిన పలు విషయాలను  తెలియజేశారు.
 

46

అయితే సాయిపల్లవిని చూడగానే సరళ తల్లి ఒక్కసారిగా కంట తడిపెట్టుకున్నారంట. తన  కూతురే ఇంటికి వచ్చిందన్న సంతోషం కలిగిందంట. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన ఆమె దుఖ: ఆపుకోలేకపోయిందంట. సాయిపల్లవిని గట్టిగా పట్టుకొని, తన పక్కనే కూర్చొబెట్టుకొని కాసేపు మాట్లాడింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

56

1990లలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన నక్సలైట్ ఉద్యమం చుట్టూ కథాంశం తిరగనున్నది  తెలుస్తోంది. ‘నీది నాది ఒకే కథ' చిత్రంతో తన సత్తా చూపించిన వేణు ఊడుగుల విరాటపర్వం కథని చాలా బలంగా రాశారని ట్రైలర్స్, సాంగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.
 

66

విడుదలకు సమయం దగ్గరవుతుండటంతో  చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేదా పేతురాజ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్‌ 17న మూవీని గ్రాండ్  గా రిలీజ్ చేయనున్నారు.    


 

Read more Photos on
click me!

Recommended Stories