Sankranthi Movies: ఈ సంక్రాంతికి బాక్సాఫీసు రణరంగమే, వచ్చేది నాలుగు కాదు, ఆరు సినిమాలు.. అవి ఏంటంటే?

Published : Oct 01, 2025, 07:15 PM IST

Sankranthi Movies: వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల మధ్య ఊహించని పోటీ నెలకొంది. పందెం కోళ్లని మించిన పోటీ థియేటర్ల వద్ద నెలకొనబోతుంది. ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద రణరంగమే అని చెప్పొచ్చు. 

PREV
18
2026 సంక్రాంతికి సినిమాల మధ్య ఫైట్‌

వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు రణరంగంగా మారబోతుంది. కోళ్ల పందాల కంటే థియేటర్లో సినిమాల మధ్య పోటీనే ఎక్కువగా ఉండబోతుంది. నీ కోడా, నా కోడా అనేదానికంటే, నీ సినిమానా? నా సినిమానా తేల్చుకుందామనే పరిస్థితినే ఎక్కువగా నెలకొంటుంది. థియేటర్ల కోసం నిర్మాతలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. మా హీరో మూవీనా? మీ హీరో సినిమానా తేల్చుకుందామని ఫ్యాన్స్ గొడవ పడే పరిస్థితి రాబోతుంది. తెలుగు సినిమాలా, తమిళ చిత్రాలా అని ఆడియెన్స్ తేల్చుకునే పరిస్థితి నెలకొనబోతుంది. మొత్తంగా 2016 సంక్రాంతికి స్టార్‌ హీరోల మధ్య పోటీ, సినిమాల సందడి మామూలుగా ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సారి ఏకంగా ఆరు సినిమాలు పోటీ పడుతున్నాయి.

28
వచ్చే సంక్రాంతికి ఏకంగా ఆరు సినిమాలు పోటీ

ఏడాది మొత్తంలో ఎక్కువగా పోటీ ఉండేది సంక్రాంతి పండక్కి మాత్రమే. అప్పుడు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే ఆ సమయంలో చాలా సినిమాలు ఆడే స్పేస్‌ ఉంటుంది. జనాలు ఆ టైమ్‌లో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే సినిమా అనే చెప్పాలి. అందుకే సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు బాగానే ఆడుతుంటాయి. బాగున్న సినిమా మాత్రం దుమ్ములేపుతుందని ఈ ఏడాది వచ్చిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ నిరూపించింది. మామూలు సినిమా కూడా మూడు వందల కోట్లు చేయగలిగే సత్తా ఉందని, ఆ సీజన్‌ లో అంతటి బిజినెస్‌ అవుతుందని నిరూపించింది. దీంతో వచ్చే సంక్రాంతికి కూడా అదే స్థాయిలో పోటీ ఉంది. తెలుగులోనే ఏకంగా నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీనికితోడు రెండు తమిళ చిత్రాలు రాబోతున్నాయి. మొత్తంగా ఆరు సినిమాలు పోటీ పడుతున్నాయి. 

38
సంక్రాంతికి బోణీ చేయబోతున్న ప్రభాస్‌ ది రాజాసాబ్‌

ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్న సినిమాల్లో మొదటగా డార్లింగ్‌ ప్రభాస్‌ ఉన్నారు. ఆయన జనవరి 9న `ది రాజాసాబ్‌`తో రాబోతున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫాంటసీ అంశాలతో రూపొందిన రొమాంటిక్‌ హర్రర్‌ కామెడీ చిత్రమిది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. హాలీవుడ్‌ స్థాయిలో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. ఇండియన్‌ మూవీస్‌లో ఈ రేంజ్‌, ఇలాంటి కంటెంట్‌ని ఇప్పటి వరకు చూడలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందులో చాలా సర్‌ప్రైజెస్ ఉన్నట్టు ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది.

48
సంక్రాంతి సందడి షురూ చేయబోతున్న చిరు `మన శంకరవరప్రసాద్‌ గారు`

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న `మన శంకరవరప్రసాద్‌ గారు` కూడా సంక్రాంతికి రాబోతుంది. ఈ మూవీ ప్రారంభం నుంచి వచ్చే సంక్రాంతికి వస్తున్నామని దర్శకుడు అనిల్‌ రావిపూడి చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికే వెంకటేష్‌తో `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ రూపొందించి బ్లాక్‌ బస్టర్‌ కొట్టారు అనిల్‌ రావిపూడి. ఇప్పుడు మెగాస్టార్‌తో చేస్తున్నారు. పైగా ఇందులో వింటేజ్‌ చిరుని చూపించబోతున్నారు. `గ్యాంగ్‌ లీడర్‌`, `ఘారానా మొగుడు` స్టయిల్‌లో ఈ మూవీ ఉంటుందని, ఎంటర్ టైన్‌మెంట్‌, యాక్షన్‌, మాస్ మసాలా అంశాల మేళవింపుగా ఉండబోతుందని ఇటీవల విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తోండటం విశేషం. రేపు(గురువారం) దసరా పండగని పురస్కరించుకుని సాంగ్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని సాహుగారపాటి, చిరు కూతురు సుష్మిత నిర్మిస్తుండటం విశేషం. అయితే సంక్రాంతికే రాబోతున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ఇంకా కన్ఫమ్‌ చేయలేదు. ఈ దసరాకి ప్రకటించే అవకాశం ఉంది.

58
నవీన్‌ పొలిశెట్టి `అనగనగా ఒక రాజు` నవ్వులు సునామీ

సంక్రాంతి పోటీలో ఉన్న మరో తెలుగు మూవీ నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన `అనగనగా ఒక రాజు`. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు నవీన్‌ పొలిశెట్టి. `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ`, `జాతిరత్నాలు`, `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రాలతో హ్యాటిక్‌ కొట్టాడు. నవ్వులు పూయించాడు. ఇప్పుడు `అనగనగా ఒక రాజు` అంటూ మరోసారి నవ్వుల వర్షం కురిపించేందుకు వస్తున్నారు. ఈ మూవీకి మారి దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ నిర్మాత నాగవంశీ నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాని సంక్రాంతి పండుగని పురస్కరించుకుని జనవరి 24న విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ లేటెస్ట్ గా ప్రకటించింది. ఇలా ఇప్పటికే మూడు సినిమాలు సంక్రాంతికి రాబోతున్నట్టు కన్ఫమ్‌ చేశాయి. ఇందులో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌.

68
సంక్రాంతి బరిలో రవితేజ

ఈ పోటీలో మరో తెలుగు మూవీ ఉండబోతుందట. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `మాస్‌ జాతర` ఈ నెల 31న విడుదల కాబోతుంది. దీంతోపాటు కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నారు రవితేజ. ఆర్‌టీ76 వర్కింగ్‌ టైటిల్‌తో తెరక్కుతున్న చిత్రమిది. దీనికి `అనార్కలి` టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. రవితేజ మార్క్ మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు కిశోర్‌ తిరుమల మార్క్ సెన్సిబులిటీస్‌ని, హ్యూమర్‌ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి పక్కా అంటున్నారు. దీంతో ఈ నాలుగు సినిమాలు వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద సందడి చేయబోతున్నాయి. అదే సమయంలో పోటీ పడబోతున్నాయి.

78
సంక్రాంతి పోటీలో విజయ్‌ `జననాయకుడు`

వీటితోపాటు మరో రెండు సినిమాలు సంక్రాంతి పోటీలో ఉన్నారు. అవి డబ్బింగ్‌ చిత్రాలు కావడం విశేషం. అవి కూడా రెండూ తమిళ సినిమాలే. సంక్రాంతి బరిలో దళపతి విజయ్‌ ఉన్నారు. హెచ్‌ వినోద్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన నటిస్తున్న చివరి మూవీ ఇదే కావడం విశేషం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అనిరుద్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 9నే విడుదల అవుతుంది. తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్‌ కాబోతుంది. అంటే ప్రభాస్‌ `ది రాజాసాబ్‌`తో పోటీపడబోతుంది. మరోవైపు `ది రాజాసాబ్‌` కూడా తమిళంలో విడుదల కానుంది. ఈ రెండు అటు తమిళనాడు, ఇటు తెలుగులో  గట్టిగా పోటీపడబోతున్నాయని చెప్పొచ్చు.

88
సంక్రాంతి బరిలో శివ కార్తికేయన్‌ `పరాశక్తి`

సంక్రాంతికే వస్తోన్న మరో మూవీ శివ కార్తికేయన్‌ `పరాశక్తి`. సుధా కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అథర్వ మురళీ, రవి మోహన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులోనూ దీన్ని గట్టిగానే విడుదల చేయబోతున్నారు. ఇలా ఏకంగా వచ్చే సంక్రాంతికి ఆరు సినిమాలు పోటీ పడబోతున్నాయి. మరి వీటిలో సక్సెస్‌ అయ్యేది ఎన్ని? ఆడియెన్స్ ని అలరించేవి ఎన్ని అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories