Sankranthi 2023: సంక్రాంతి వేళ కుందనపు బొమ్మలా తయారైన సితార... మహేష్ కూతురు మెస్మరైజింగ్ ఫోటోలు వైరల్!

Published : Jan 15, 2023, 01:17 PM IST

సితార ఘట్టమనేని పండగ లుక్ వైరల్ అవుతుంది. లెహంగా, చోళీ ధరించి సంప్రదాయ లుక్ లో కుందనపు బొమ్మలా తయారైంది.

PREV
18
Sankranthi 2023: సంక్రాంతి వేళ కుందనపు బొమ్మలా తయారైన సితార... మహేష్ కూతురు మెస్మరైజింగ్ ఫోటోలు వైరల్!
Sitara Ghattamaneni

మహేష్ గారాల పట్టి సితార సాంప్రదాయ కట్టుబొట్టుకి ఫ్యాన్స్ ముగ్ధులయ్యారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. క్యూట్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 
 

28
Sitara Ghattamaneni


సితార చాలా టాలెంటెడ్.  పదేళ్ల ప్రాయంలోనే  సోషల్ మీడియాను షేక్ చేస్తుంది సితార (Sitara Ghattamaneni). మహేష్ కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సితార... ఈ తరం కిడ్స్ కి రోల్ మోడల్ అని చెప్పాలి. 
 

38
Sitara Ghattamaneni


సితారకు సామాజిక విషయాలపై ఆమెకు అవగాహన ఉంది. ఇక సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ టూర్స్, వెకేషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. తరచుగా ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తుంది.
 

48
Sitara Ghattamaneni

సితార ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఏకంగా  మిలియన్ నెటిజెన్స్ ఆమెను ఫాలో అవుతున్నారు. ఒక చిన్నారికి పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక రికార్డు కూడా. ఇండియాలో మహేష్ (Mahesh Babu)కూతురు సితారకు ఉన్నంత మంది ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ మరో స్టార్ కిడ్ కి లేరు. 
 

58


సితార పేరున ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. సదరు ఛానల్ లో పలు ట్రావెల్, సోషల్ అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తుంది. సితారకు దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య క్లోజ్ ఫ్రెండ్. వీరిద్దరూ కలిసి ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. మట్టి వినాయకుడిని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటూ సోషల్ మెసేజ్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. 

68

ఇక ఇంస్టాగ్రామ్ లో సితార పంచుకునే ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మహేష్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ వీడియోలు చేయడం సీతారకు భలే సరదా. అప్పుడప్పుడు తన సింగింగ్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. 
 

78


మహేష్ గత చిత్రం సర్కారు వారి పాట సాంగ్ ప్రోమోలో సితార కనిపించడం విశేషం. పెన్నీ సాంగ్ లో ఆమె డాన్స్ చేశారు. సితార నటించిన సాంగ్ ప్రోమోను విశేష ఆదరణ దక్కింది. 
 

88


పిల్లలను ప్రాణప్రదంగా ప్రేమించే మహేష్ వాళ్లే ప్రపంచంగా బ్రతికేస్తారు. షూటింగ్స్ కి ఏమాత్రం బ్రేక్ దొరికినా వరల్డ్ టూర్ కి వెళ్ళిపోతారు. ప్రపంచంలో అందమైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నా... చుట్టి వస్తారు. ఫ్రెండ్స్, పార్టీలంటే ఇష్టపడని మహేష్ ఇంట్లో కూడా తన టైం సితార, గౌతమ్ తో గడిపేస్తారు.
 

click me!

Recommended Stories