ఇక ఉప్పెనసినిమాతో స్టార్ గామారిపోయింది కృతిశెట్టి. బేబమ్మగా పాపులర్ అయ్యింది. ఈసినిమా తరువాత స్టార్ హీరోలు కృతి శెట్టి ఉంటేనే సినిమా అన్నట్టుగా మారిపోయిందిపరిస్థితి. వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది కృతి శెట్టి హ్యాట్రిక్ హిట్ కూడా కొట్టేసింది. ఉప్పెన తరువాత నాని, నాగచైతన్య,రామ్ లాంటియంగ్ స్టార్ హీరోల సరసన మెరిసింది బ్యూటీ. రామ్ తో నటించి వారియర్ సినిమాతో గట్టి దెబ్బ తగలడంతో.. కాస్త చూసి సినిమాలు సెలక్ట్ చేసుకుంటుంది.