Bangarraju Review:బంగార్రాజు ప్రీమియర్ షో టాక్... నాగ్-చైతూల మాస్ జాతర.. పర్ఫెక్ట్ Sankranthi 2022 చిత్రం

First Published Jan 14, 2022, 7:20 AM IST


ఆర్ ఆర్ ఆర్ (RRR Movie), రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి పెద్ద చిత్రాల వాయిదా నిర్ణయంతో బంగార్రాజు సంక్రాంతి బరిలో దిగారు. చకచకా పనులు పూర్తి చేసి పెద్ద పండుగకు సినిమా సిద్ధం చేశారు. నాగార్జున-నాగచైతన్య మరోసారి కలిసి నటిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగార్రాజు చిత్రంపై భారీ హైప్ నెలకొని ఉంది. 

జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న బంగార్రాజు (Bangarraju)యూఎస్ ప్రీమియర్స్ విషయంలో సమస్య తలెత్తింది. దీంతో ఆలస్యంగా ప్రీమియర్స్ ప్రదర్శన జరిగింది. లేటైనా కూడా లేటెస్ట్ టాక్ వచ్చేసింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన విలేజ్ డ్రామా ప్రీమియర్ టాక్ ఎలా ఉందో చూద్దాం...

బంగార్రాజు మూవీ కథ విషయానికి వస్తే... సోగ్గాడే చిన్నినాయనా కథ ఎక్కడ ముగుస్తుందో అక్కడ నుండి బంగార్రాజు మొదలవుతుంది. బంగార్రాజు(నాగార్జున) వారసుడిగా నాగ చైతన్య రంగంలోకి దిగుతాడు. అమ్మాయిలతో రొమాన్స్, అల్లరిలో అచ్చం అప్పటి బంగార్రాజును తలపిస్తూ ఉంటాడు. ఆటపాటలతో అల్లరిగా సాగే నాగ చైతన్య జీవితంలో ఆ ఊరి శివాలయం కారణంగా ఊహించిన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రత్యర్థులు నాగ చైతన్యను టార్గెట్ చేస్తారు. మరి వాళ్ళను నాగ చైతన్య ఎలా ఎదుర్కొన్నాడు? చైతూ కి బంగార్రాజు ఆత్మ ఏ విధంగా సహాయం చేసింది? చివరకు నాగ చైతన్య కథ ఎలా ముగిసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్నినాయనా మూవీతో సూపర్ హిట్ కొట్టారు. దానికి సీక్వెల్ గా విడుదలైన బంగార్రాజు (Bangarraju movie review)మూవీపై పాజిటివ్ బజ్ చోటుచేసుకుంది. నాగార్జున సైతం మూవీ విజయంపై గట్టినమ్మకంతో ఉన్నారు. మరి చిత్ర యూనిట్ ఆశలు, ప్రేక్షకుల అంచనాలు బంగార్రాజు అందుకున్నాడా? అంటే.. అవుననే చెప్పాలి.


బంగార్రాజు చిత్రానికి ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ రిపోర్ట్స్ అందుతున్నాయి. ముఖ్యంగా మొదటిసారి ఊర మాస్ రోల్ చేసిన నాగ చైతన్య (Naga Chaitanya)ప్రెజెన్స్, పెర్ఫార్మన్స్ అదుర్స్ అన్నమాట వినిపిస్తుంది. విలేజ్ ప్లే బాయ్ రోల్ లో చైతూ మేనరిజం, గోదావరి డైలెక్టు మెప్పించాయి. లవర్ బాయ్ ఇమేజ్ నుండి మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నాగ చైతన్యకు ఇది పర్ఫెక్ట్ అటెంప్ట్ అని చెప్పవచ్చు. 


సోగ్గాడే చిన్నినాయనా మూవీ నాగార్జున (Nagarjuna) వన్ మాన్ షో కాగా.. బంగార్రాజు చైతూ వన్ మాస్ షో అని చెప్పాలి. ఇక నాగార్జున, నాగ చైతన్యల లుక్స్ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. పంచ కట్టులో ఇద్దరినీ పక్కపక్కనే వెండితెరపై చూడడం ఫ్యాన్స్ కి పండగే. అరవై ఏళ్ల నవమన్మధుడు నాగార్జున మ్యాజిక్ వర్క్ ఔట్ అయ్యిందంటున్నారు. 


ఇక విలేజ్ సర్పంచ్ నాగలక్ష్మి పాత్రలో కృతి శెట్టి (Krithi Shetty)కేక. హెడ్ వైట్ తో కూడిన ఇన్నోసెన్స్.. పాత్రకు తగ్గట్లు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఫస్ట్ హాఫ్ లో అలరిస్తాయి. చైతూతో కృతి రొమాంటిక్, కామెడీ సన్నివేశాలు అనుభూతిని పంచుతాయి. వెన్నెల కిషోర్, రావు రమేష్ కామెడీ పర్వాలేదంటున్నారు. 


అనూప్ రూబెన్స్ సాంగ్స్.. ఆకట్టుకున్నాయి. ఇక బంగార్రాజు సినిమాకు మైనస్ గా ఫ్లాట్ నేరేషన్ అని చెప్పవచ్చు. ఎటువంటి ట్విస్ట్స్ లేకుండా కథ సాగుతుంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయి. సినిమా బడ్జెట్ తో పాటు, తగినంత సమయం లేకపోవడంతో సీజీ వర్క్ బాగాలేదన్న మాట వినిపిస్తుంది. 

రొటీన్ కథకు కామెడీ, రొమాన్స్, యాక్షన్ జోడించి దర్శకుడు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా బంగార్రాజు సంక్రాంతి ప్రేక్షకులను అలరించే చిత్రంగా చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ కు మాత్రం ఫీస్ట్ లా ఉంటుంది. నిర్మాణ విలువలు, నేరేషన్, స్టోరీలో లోపాలు ఉన్నప్పటికీ ఆద్యంతం ఆసక్తికరంగా నడిపే ప్రయత్నం దర్శకుడు చేశారు.

నాగ చైతన్య, నాగార్జున మాస్ ప్రెజెన్స్, కృతి గ్లామర్, కామెడీ.. ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్న బంగార్రాజు మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. టాక్ తో సంబంధం లేకుండా సంక్రాంతి సినిమాలు ఆదరణ దక్కించుకుంటాయి. ఇక బంగార్రాజు లాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రీచ్ ఉంటుంది. కాబట్టి బంగార్రాజు విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. 
 

click me!