మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం మే 9న గ్రాండ్ గా రీ రిలీజ్ అవుతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ దృశ్య కావ్యం దాదాపు 35 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మేకర్స్ ఈసారి 4K వెర్షన్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చిత్రం రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా చిరంజీవి, రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.