‘ప్రేమ పెళ్లి.. అయినా మరొకరితో భర్త ఎఫైర్’.. వివాహ బంధంపై ‘వారసుడు’ నటి వ్యాఖ్యలు!

First Published | Oct 2, 2023, 6:29 PM IST

తమిళ నటి సంయుక్త షణ్ముఖనాథన్ తన వివాహ బంధం గురించి ఓపెన్ అయ్యారు. ప్రేమించుకొని పెళ్లి పీటలు ఎక్కినా.. తన భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం మనస్సును ముక్కలు చేసిందంటూ వ్యాఖ్యలు చేసింది. 
 

తమిళ నటి సంయుక్త షణ్ముఖనాథన్ (Samyuktha Shanmughanathan) తమిళ బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీజన్ 4తో అక్కడి ఆడియెన్స్ ను అలరించింది. అంతకుముందు టీవీ సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది.  బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో మాత్రం నటిగా అవకాశాలు దక్కించుకుంది. 
 

‘వారసుడు’, ‘తుగ్లక్’, ‘దర్బార్’ వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ తో ఆకట్టుకుంది. కెరీర్ ప్రస్తుతం సాఫీగానే సాగుతోంది. అయితే, ఆమె పర్సనల్ లైఫ్ గురించి తాజాగా షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఓ ఇంటర్వ్యూలో సంయుక్త తన వివాహ బంధంపై చేసిన కామెంట్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 
 


ఆమె మాట్లాడుతూ..  నా భర్త దుబాయ్ లో బిజినెస్ మెన్. కరోనా సమయంలోనే ఆయన గురించి నాకు ఓ నిజం తెలిసింది. నాలుగేళ్లుగా మరో అమ్మాయితో ఎఫైర్ నడిపిస్తున్నట్టు బయటపడింది. ఆ విషయంతో నా గుండె బరువెక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. లాక్ డౌన్ కారణంగా ఎక్కడికి పోలేని పరిస్థితిని ఎదుర్కొన్నాను. 
 

ఆ సమయంలోనే నాకు టీవీ యాంకర్ భావన బాలకృష్ణన్ పరిచయం అయ్యింది. ఇద్దరం ఒకే ప్లాట్ లో ఉండేవాళ్లం. ఆమె వల్లే నేను బిగ్ బాస్ పరిచయం అయ్యాను. ఈ క్రమంలో నా భర్త, కుటుంబం గురించి అడిగిందామె. కన్నీళ్లు ఆగలేదు. అన్నీ చెప్పేశాను. ఆమె నన్ను ఓదార్చింది. మేలో నా 8వ మ్యారేజ్ ఉండింది. అప్పుడు ఒక్కదాన్నే కుమిలిపోయాను. ఆమె సలహాతోనే బిగ్ బాస్ షోకి ట్రై చేశాను. 
 

భావన సహాయం, బిగ్ బాస్ వల్ల ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాను. నాకు ఓ కొడుకూ ఉన్నాడు. నాన్న ఎక్కడంటూ అడుగుతుంటాడు. విదేశాల్లో వర్క్ చేస్తుంటారని చెబుతుంటాను. ఆయన మాకెందుకు ఇంత అన్యాయం చేశాడో తెలియదు. విడాకులిస్తానంటున్నా ఇండియా రావడం లేదు. ఇంకా డివోర్స్ ప్రక్రియ పూర్తి కాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు నెటిజన్లు సైతం బాధపడుతున్నారు. 
 

సంయుక్త పెళ్లై ఎనిమిదేళ్లు దాటింది. 2015లో దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త కార్తీక్ శంకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు బాబు రేయాన్ పుట్టాడు. ప్రస్తుతం సంయుక్త మోడల్ గా, నటిగా కెరీర్ లో ముందుకు వెళ్తోంది. వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. న్యూట్రిషన్ కోచ్ గానూ అనుభవం ఉంది. 
 

Latest Videos

click me!