అయితే ఏ బిజినెస్ పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఎలాంటి ఇండస్ట్రీ పెడతావు, ఏం చేయాలని ఉందని అడిగితే.. అప్పుడు నాగార్జున అసలు విషయం బయటపెట్టాడట. `నాకు సినిమాల్లో యాక్ట్ చేయాలనుంది` అని చెప్పాడట. సినిమాల్లో చేయాలంటే నాటకాల అనుభవం లేదు, అది(యాక్టింగ్ కోర్స) లేదు, ఇది లేదు ఎలా అనుకున్నారట. కచ్చితంగా తాను నటించాలనుకుంటున్నట్టు చెప్పడంతో డైలాగ్ డెలివరీ, అలాగే కరాటే నేర్పించారట. ఆరేడు మాసాలు బాంబేలో ఓ లేడీ వద్ద యాక్టింగ్‌కి సంబంధించిన క్రాష్ కోర్స్ నేర్పించాడట. ఆ తర్వాత సినిమాల్లోకి తీసుకొచ్చినట్టు చెప్పాడు ఏఎన్నార్.