'బింబిసార' హీరోయిన్ హెవీ వర్కౌట్స్ వైరల్.. హాట్ భంగిమలతో చెమటలు పట్టిస్తున్న బ్యూటీ

Published : Aug 06, 2022, 11:40 AM IST

భీమ్లా నాయక్ చిత్రంతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది. తాజాగా బింబిసార చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ.

PREV
17
'బింబిసార' హీరోయిన్ హెవీ వర్కౌట్స్ వైరల్.. హాట్ భంగిమలతో చెమటలు పట్టిస్తున్న బ్యూటీ

భీమ్లా నాయక్ చిత్రంతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది. తాజాగా బింబిసార చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ. టైం ట్రావెల్ నేపథ్యంలో సాగిన బింబిసార చిత్రంలో సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. 

27

వరుస విజయాలతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్ క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా సంయుక్త సూపర్ యాక్టివ్ గా ఉంటూ ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటోంది. 

37

తాజాగా సంయుక్త మీనన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన జిమ్ వర్కౌట్ వీడియోస్, ఫొటోస్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. సంయుక్త హెవీ వర్కౌట్స్ చేస్తూ తన అందాలకు పదును పెడుతోంది. మతి పోగొట్టే భంగిమల్లో సంయుక్త మీనన్ వర్కౌట్స్ చేస్తూ కుర్రాళ్లని ఊరిస్తోంది. 

47

ఒళ్ళు గగుర్పొడిచేలా సంయుక్త మీనన్ కష్టతరమైన జిమ్ ఫీట్లు చేస్తోంది. సంయుక్త మీనన్ ఈ రేంజ్ లో కష్టపడుతుంది కాబట్టే అంత అందంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

57

సంయుక్త మీనన్ ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె నటించిన రెండు చిత్రాలు వరుసగా విజయం సాధించడం అదృష్టం అనే చెప్పాలి. 

67

భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా సంయుక్త నటించింది. ఆ చిత్రంలో సంయుక్త ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు బింబిసారలో కూడా సంయుక్త నటన గురించి మంచి విషయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సంయుక్త మీనన్.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ సరసన సార్ చిత్రంలో నటిస్తోంది. 

77

తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా సార్ తెరకెక్కుతోంది. ఈ చిత్రం విజయం సాధిస్తే తమిళంలో కూడా సంయుక్త పాగా వేయడం ఖాయం. అందుకే సంయుక్త మరింత నాజూకు అందాల కోసం జిమ్ లో చెమటలు చిందిస్తోంది. 

click me!

Recommended Stories