
ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో ఎయిర్ పోర్ట్ కు బయలుదేరుతున్న తులసికి కుటుంబ సభ్యులు జాగ్రత్తలు చెబుతుంటే దానికి ఆనందంతో తులసి మీకు ఒక విషయం గుర్తు చేయనా మీకు అమ్మను నేను అంటుంది. దానికి ప్రేమ్ అందుకే కదమ్మా ఈ జాగ్రత్తలు నువ్వు మాకు ఎంతో విలువైన దానివి అంటాడు దానికి తులసి ఆప్యాయంగా ప్రేమను దగ్గరకు తీసుకుంటుంది. తరువాత తులసి ఆటోలో ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతుంది. మరొకవైపు ఉత్సాహంగా కారులో బయలుదేరిన సామ్రాట్, అతని బాబాయి సంభాషించుకుంటూ ఉండగా ఇంతలో కార్ ట్రబుల్ ఇస్తుంది. కార్ బ్రేక్ డౌన్ అయింది ఇక మెకానిక్ రావాల్సిందే లేదంటే కష్టం అని డ్రైవర్ చెబితే కంగారుగా ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్ అని అడగగా అందుకు బాబాయ్ టెన్షన్ ఎందుకు క్యాబ్ బుక్ చేసుకొని సలహా ఇస్తాడు. కానీ ఫ్లైట్ టైం ఇంకా అరగంట మాత్రమే ఉందని నడుచుకుంటూ ఎయిర్పోర్టుకు బయలుదేరుతాడు.
మరోవైపు తులసి ఆనందంగా ఉత్సాహంగా మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నానని ఊహించుకుంటూ ఉంటుంది. రోడ్డుపై వచ్చి పోయే వాహనాలను సామ్రాట్ లిఫ్ట్ అడుగుతుండగా అది గమనించిన డ్రైవర్ తులసి తో ఎవరో పాపం రోడ్డుపై లిఫ్ట్ అడుగుతున్నారు ఎక్కించుకుందామని అడుగుతాడు. ఇక మధ్యలో కాస్త సీన్ జరగ్గా తులసి సామ్రాట్ ను ఆటో ఎక్కమని పిలుస్తుంది. దానికి డ్రైవర్ అదేంటి మేడం మీరే కదా లిఫ్ట్ ఇద్దామంటే ఎవరిని పడితే వారిని ఎక్కించుకుంటావని కోపగించుకున్నారు కదా అనగా.. దానికి తులసి అయ్యో ఎవరో తెలియక అలా అన్నాను అంటుంది. తరువాత ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతారు. తరువాత సన్నివేశంలో దివ్య అంకితతో చాలా రోజుల తర్వాత వదిన చేతి వంట తింటున్నాను అంటూ నవ్వుకుంటుంది. మరొకవైపు సామ్రాట్ ఇంకా తులసి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు మరొకవైపు ఇంట్లో ప్రేమ్ వాళ్ళ తాతయ్యతో అమ్మ ఇప్పుడే ఎయిర్పోర్ట్ చేరిందట అని సంభాషిస్తూ ఉండగా అక్కడికి నందు లాస్య అక్కడికి వస్తారు.
లాస్య వెటకారంగా కూతురు కానీ కూతుర్ని పరాయి వ్యక్తితో హాయిగా విహారయాత్రకు పంపించి మీ అమ్మానాన్న ఎంత రిలాక్స్ గా కూర్చున్నారు అని నందుతో చెబుతుంది. వాళ్లు వెళ్ళింది విహారయాత్రకు కాదు ఆఫీస్ పని మీద అంటూ నందు తండ్రి బదులిస్తాడు దానికి లాస్య సతీ సావిత్రి అని టైటిల్ పెట్టి రొమాంటిక్ సినిమా తీసినట్టు పేరుకు వాళ్లు వెళ్ళింది ఆఫీస్ వర్క్ మీదే కానీ అంటూ ఉండగా దానికి అనసూయ కోపంగా తులసి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అంటుంది. దానికి లాస్య మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను ఇంటి కోడల్ని.. మీ కొడుకుకు భార్యను ఈ ఇంటి పరువును వైజాగ్ బీచ్ లో సముద్రంలో కలుపుతుంటే నేను చూస్తూ ఊరికే ఉండలేను అంటుంది.
మాట్లాడవేంటి నందు అనగానే దానికి నందు ఏం మాట్లాడమంటావు తులసిని పంపొద్దని కాల్ చేసి మరి చెప్పాను అయినా నా మాట వినలేదు అంటాడు. దానికి అనసూయ మాట్లాడుతూ నీ మాటలు వినవలసిన అవసరం మాకు లేదు అంటే దానికి లాస్య అదేంటి అత్తయ్య అలా అంటారు మీరు హాయిగా ఇంట్లో కూర్చుంటారు. బయట పబ్లిక్ లో తిరిగేది మేము అడ్డమైన కామెంట్స్ చెవిన పడేవి మాకు.. పాపం ఒకసారి నందు మొహం చూడండి తన బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఎలా నలిగిపోతున్నాడు అని అంటే.. ఆ మాటలకు ప్రేమ్ స్పందిస్తూ ఆయన ఎందుకు బాధపడుతున్నాడు. మా అమ్మకు ఆయనకు ఏంటి సంబంధం.. ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని ప్రశ్నిస్తాడు.
దానికి లాస్య తులసిని నువ్వు అమ్మ అని పిలుస్తావు నందగోపాల్ని నాన్న అని పిలుస్తావు ఈ సంబంధం చాలదా జోక్యం చేసుకోవడానికి నువ్వు మాట్లాడినందుకు అంటూ ఉండగా దానికి ప్రేమ్ నువ్వు బలవంతంగా ఆయన చేత మాట్లాడిస్తున్నావు అంటాడు. లాస్య మాట్లాడుతూ ఇప్పుడు తులసి నందుకు మాజీ భార్య కావచ్చు.. కానీ పాతిక సంవత్సరాలు కలిసి కాపురం చేశాడు. తులసి ప్రవర్తన చూసి పైకి ఏమీ అనలేక లోపల కుమిలిపోతున్నాడు దానికి ప్రేమ అంత అవసరం లేదని చెప్పు అనగా అంకిత కలుగజేసుకొని ప్రేమ్ ఇంటికొచ్చిన డాడీని అవమానకరంగా మాట్లాడవద్దు అంటుంది దానికి ప్రేమ్ వాళ్లు అమ్మ గురించి అవమానకరంగా కామెంట్లు చేస్తున్నారు అది వినపడదా నీకు అంటూ ఉండగా అభి ఎంటరై తప్పు చేస్తుంది కాబట్టే అంటున్నారు అని కోపంగా చెబుతాడు.
ఇంతలో పక్కింటి వారు వచ్చి అనసూయ గారిని నోము పేరంటానికి ఆహ్వానించడానికి అక్కడికి వస్తారు. వచ్చినవారు ఇంట్లో తులసి గారు లేరా అని అడగక దానికి లాస్య మీ తులసి ఒకప్పటి తులసి కాదు మీరు వచ్చినప్పుడు ఇంట్లో ఉండడానికి ఇప్పుడు పెద్ద బిజినెస్ ఉమెన్ అయింది అని వెటకారంగా చెబుతుంది. వచ్చిన వారితో లాస్య తులసి గురించి అవమానకరంగా మాట్లాడుతుంది. దానికి వారు ఇంటి దగ్గర ఉండక అలా ఎలా వెళుతుంది.. తను అలా వెళ్తుంటే మీరు ఎలా వెళ్ళానిచ్చారు అనగా దానికి లాస్య లేదు హారతి ఇచ్చి ఆటో ఎక్కించి అత్తారింటికి పంపినట్టు పంపారు అని అంటుంది. ఆ మాటలకు అనసూయ కోపంతో లాస్య అంటే.. ఆమెతో వచ్చిన వారు ఇలాంటి వారిని తిరుగుబోతు, బరితెగించిన వారు అంటారు అని సంబోధిస్తారు. తులసి మామయ్య గారు వచ్చిన వారిపై కోప్పడతారు. అలా కోపడగానే లాస్య చూడండి ఇద్దరు మాట్లాడితేనే భరించలేక పోతారు రేపు ఊరు ఊరంతా ఈ విషయం గురించి చర్చించుకుంటే భరించలేరు ప్రశాంతంగా ఆలోచించండి అంటుంది.
ఇక అక్కడి నుండి లాస్య నందు వెళ్లిపోతారు దానికి ప్రేమ వెతుకుతుంటే కుళ్ళు అంటాడు. అప్పుడు తాతయ్య ఇక్కడ జరిగింది తులసికి తెలియనివ్వకూడదు తెలిస్తే బాధపడుతుంది అంటాడు. ఇక ఎయిర్పోర్ట్ లో ఫైల్స్ గురించి ఇద్దరు సంబాషించుకుంటూ ఉండగా తులసి ఒక ఫైలే ఉంది రెండో ఫైల్ ఎక్కడ అని కంగారు పడుతుంది అప్పుడు సామ్రాట్ నందుకు ఫోన్ చేసి నందుకు ఫైల్ మరిచిపోయిన విషయం చెప్తాడు. దానికి నందు ఫైల్ ఎయిర్పోర్టుకు రావాలని అడిగితే కాదు ఫైల్ తీసుకొని నువ్వు కూడా ఫ్లైట్ కి వచ్చేసేయ్.. అన్ని మీటింగ్స్ క్యాన్సల్ చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ప్రాబ్లం సాల్వ్ అంటాడు. కొద్ది సమయం తర్వాత నందు లాస్య ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడక తప్పదు.