Intinti Gruhalakshmi: జాబ్ లేకపోవడంతో గిల్టీగా ఫీల్ అవుతున్న నందు.. సంతోషంలో తులసి, సామ్రాట్?

Published : Dec 22, 2022, 11:05 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
18
Intinti Gruhalakshmi: జాబ్ లేకపోవడంతో గిల్టీగా ఫీల్ అవుతున్న నందు.. సంతోషంలో తులసి, సామ్రాట్?

ఈరోజు ఎపిసోడ్ లో తులసి,సామ్రాట్ ఇద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు నేను మిమ్మల్ని భయపెట్టి అంత దాన్నా అని తెలిసి అనగా మరి ఆరోజు ఐస్క్రీం బండి దగ్గర మీరు చేసింది ఏంటండీ అని అంటాడు సామ్రాట్. ఇప్పుడేంటి తులసి గారి నన్ను పార్టీకి తీసుకెళ్తున్నారా లేదా అని అనగా మీకు ఎటువంటి పార్టీ కావాలి సామ్రాట్ గారు అని అడగడంతోమీకు ఏది అందంగా అనిపిస్తుందో దానిని పార్టీగా ఇవ్వండి అని అంటాడు సామ్రాట్. అప్పుడు తులసి సరే అని అంటుంది. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తెలిసి సరే వెళ్దాం పదండి పార్టీ చేసుకుందాం అని అడగగా, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు అని సామ్రాట్ అంటాడు .
 

28

ఒక పని చేయండి మీకు ఆకలి అయ్యేవరకు నాతో కలిసి తిరగండి మీకు ఎన్నో విషయాలు పరిచయం చేస్తాను అనగా సామ్రాట్ సరే వెళ్ళాం పదండి అని అంటాడు. ఆ తర్వాత ఒక చోటికి  వెళ్లి  తులసి తన పర్సులో ఉన్న 500 తీసి రోడ్డుపై పెట్టి సరే పక్కకు వెళ్దాం పదండి ఈ పరిస్థితి ఎవరి చేతికి చిక్కుతుందో చూద్దాం అని అనగా సరే అని సామ్రాట్ తులసి పక్కకు వెళ్లి నిలుచుంటారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అటుగా వచ్చి ఆ పర్సుని చూసి అక్కడే ఉన్న సీసీ కెమెరాకు భయపడి డబ్బులు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
 

38

 అప్పుడు తులసి సామ్రాట్ దగ్గర నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఒక ముసలావిడ ముసలాయన కళ్ళు కనిపించని వారు అటుగా వస్తూ ఉంటారు. అప్పుడు తులసి దేవుడా ఆఫర్స్ వాళ్ళు ఆ పర్స్ తీసుకునేలా చూడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒక అతను నా కర్రకు ఏదో తగులుతుంది లక్ష్మి అది ఏదో విలువైన వస్తువుల ఉంది అని తులసి రోడ్డు మీద వేసిన డబ్బులను తీసుకుంటాడు. అదిచూసి తులసి సామ్రాట్ ఇద్దరు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు ఇద్దరు ముసలి వాళ్లు ఎవరో పరసు పోగొట్టుకున్నట్టు ఉన్నారు అని చుట్టూ పిలుస్తూ ఉండగా ఎవరూ రాకపోవడంతో సరే అక్కడ పడేయండి అని ఆమె అంటుంది.

48

ఇంతలో తులసి అక్కడికి వచ్చి మీకు దొరికింది కదా పెద్దాయన మీరే తీసుకోవచ్చు కదా అని అనగా మనది కాని దాని గురించి మనం ఎప్పుడు ఆశపడకూడదు అని అంటాడు. అప్పుడు తులసి ఆ డబ్బులు మీరే ఉంచుకోండి మీకు ఖర్చులకు పనికొస్తాయి అని అనగా అలాంటి పర్సలు ఇంకా ఒక 20 దొరికినా మాకు కష్టాలు తీరవు అని అంటాడు. అప్పుడు సరే అని తులసి ఆ పర్సు నాదే అనగా సరే తీసుకోమ్మా అని అంటాడు అతను. అదేంటి పర్సు నాదే అనగానే ఇచ్చేస్తున్నాడు అని అనగా కళ్ళు లేని వాళ్ళం ఏది చెప్పిన నమ్మాల్సిందే కదా అమ్మ అని అంటాడు. అప్పుడు ఆ ముసలి వాళ్లకు 500 తిరిగి ఇచ్చేస్తుంది తులసి.

58

మరొకవైపు నందు కార్లో వెళ్తూ అనసూయ అన్నమాట తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తనకు ఉద్యోగం లేదని బాధపడుతూ ఉంటాడు నందు. మరొకవైపు తులసి సామ్రాట్ ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ ఇద్దరు ముసలి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. మంచి మనసున్న వాళ్లకి కళ్ళు ఇవ్వలేదు కళ్ళు ఉన్న వాళ్లకు మంచి మనసు ఇవ్వలేదు అని బాధపడుతుంది తులసి. అప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఎలా రోడ్డు దాటుతారో కదా తులసి గారు, ఆ కళ్ళు లేని వారికి ఏదో ఒక విధంగా దేవుడు ధైర్యం వచ్చి ఉంటాడు అని అనగా వెంటనే తులసి మీకు దేవుడు అన్ని ఇచ్చాడు కదా మీకు ఏమాత్రం ధైర్యం ఉందో ఇప్పుడే చెక్ చేస్తాను ఉండండి అని అంటుంది.
 

68

ఇప్పుడు తులసి కళ్ళకు గంతలు కడతాను ఈ రోడ్డు దాటి మీరు కళ్ళు లేని వారి కంటే ధైర్యస్తులు అని నిరూపించండి అనడంతో సామ్రాట్ ధైర్యంగా సరే అని అంటాడు. అప్పుడు తులసి సామ్రాట్ కళ్ళకు గంతలు కట్టి రోడ్డు దాటమని చెబుతుంది. అప్పుడు సామ్రాట్ రోడ్డు దాటడానికి ఒక్కొక్క అడుగు నిదానంగా వేస్తూ ఉంటాడు. అప్పుడు వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి రావడంతో సామ్రాట్ భయపడి వెనక్కి వచ్చేస్తాడు. ఇప్పుడు అనవసరంగా నోరు జారాను తులసి గారు మాట్లాడండి అని అంటాడు. తర్వాత సామ్రాట్ మళ్లీ చివరిసారిగా ప్రయత్నిస్తాను అని రోడ్డు దాటడానికి ప్రయత్నించి చేత కాకపోవడంతో వెనక్కి వచ్చేస్తాడు.
 

78

అప్పుడు తులసి సామ్రాట్ కి కళ్ళు లేని వారి జీవితం గురించి ఇలాగే ఉంటుందండి అని చెబుతుంది. మరొకవైపు నందు ఒక హోటల్ కి వెళ్లి కూర్చుని ఉంటాడు. నన్ను నమ్మి మా వాళ్ళందరూ నాతోనే ఉన్నందుకు సంతోష పడాలో జాబ్ లేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అదే హోటల్ కి సామ్రాట్ తులసి ఇద్దరు వస్తారు. సామ్రాట్ తులసి ఇద్దరూ కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి మాట్లాడుతూ సామ్రాట్ గురించి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో సామ్రాట్ ఇక ఆపేయండి అని అంటాడు. 

88

అప్పుడు తులసి సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసిన నందు షాక్ అవుతాడు. ఎవరికి కనపడకుండా దాక్కోవాలి అనుకుంటున్నాను వాళ్లే నా కళ్ళ ముందు ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తులసి చూడక ముందు అక్కడ నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు నందు. అప్పుడు నందు తిన్న తర్వాత జోబిలో చూసుకుంటే డబ్బులు లేకపోవడంతో షాక్ అవుతాడు.  ఏదోలా మేనేజ్ చేసి పరువు పోకుండా ఇకనుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు.

click me!

Recommended Stories