అయితే, ఓ రోజు అమ్మా, తమ్ముడు సినిమాకు వెళ్లారు. అదే థియేటర్ కు ఆ అమ్మాయి కూడా వెళ్లిందంట. ఏమైందో ఏమో గానీ.. అస్సలు ఆ అమ్మాయే వద్దంటూ వారించింది. చేసేదేమీ లేక నేనూ వదులుకున్నాను. ఆ కొద్ది రోజులకే పెళ్లి చూపులకు వెళ్లి జుబేదాను వివాహం చేసుకున్నాను. ముందు జుబేదా అక్కను చూసేందుకు పెళ్లిచూపులకు వెళ్లితే రిజెక్ట్ చేసింది.. నాకు కొపం వచ్చి ఆమె చెల్లినే పెళ్లి చేసుకున్నాను.’ అంటూ తన ప్రేమ, పెళ్లి విషయాలను ఇంట్రెస్టింగ్ గా అభిమానులతో పంచుకున్నాడు.