Sampoornesh Babu: సినిమాకు 3 కోట్లు.. కారు, ఇల్లు, భూమి, సంపూర్ణేష్ బాబు ఆస్తులు తెలిస్తే షాక్ అవుతారు? బర్నింగ్ స్టార్ సంపాదన ఎంత?

Published : Oct 02, 2026, 11:50 AM IST

Sampoornesh Babu: చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ను ఇష్టపడతాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. రీసెంట్ గా నాని ది ప్యారడైజ్ సినిమాలో డిఫరెంట్ కామెడీ పాత్ర చేశాడు బర్నింగ్ స్టార్. ఈసినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు? ఆయన ఆస్తులు ఎన్ని కోట్లు?

PREV
15
బర్నింగ్ స్టార్ గా గుర్తింపు..

తెలుగు సినీ చిత్రసీమలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి, తన విలక్షణమైన కామిక్ టైమింగ్ మరియు పేరడీ చిత్రాలతో 'బర్నింగ్ స్టార్'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. 'హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆయన, ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. తక్కవు టైమ్ లోనే ప్రేక్షకుల్లో సరికొత్త మేనియాను సృష్టించిన సంపూ సంపాదన, ఆస్తుల వివరాలు నెటిజన్లలో ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇంతకీ బర్నింగ్ స్టార్ సంపాదన ఎంత? ఎన్ని కోట్లు సంపాదించాడు?

25
సినిమా ప్రయాణం ‌- గుర్తింపు

నరసింహాచారిగా సాధారణ జీవితం ప్రారంభించిన ఆయన, సంపూర్ణేష్ బాబుగా మారి తొలి సినిమా హృదయ కాలేయం తోనే సంచలన విజయం సాధించారు. తర్వాత కాలంలో 'సింగం 123', 'కొబ్బరి మట్ట' వంటి సినిమాలతో కామిక్ హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా కొన్ని పెద్ద సినిమాల్లో కీలక పాత్రల్లో, అతిథి పాత్రల్లో కూడా మెరిసి ప్రేక్షకులను అలరించారు. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 1 లో పాల్గొనడం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా మరింత చేరువయ్యారు.

35
ది ప్యారడైజ్ సినిమాలో కీలక పాత్ర

రీసెంట్ గా సంపూర్ణేష్ బాబు ది ప్యారడైజ్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించాడు. బిర్యానీ అనే ఓ డిఫరెంట్ కామెడీ పాత్రలో ఆడియెన్స్ ను మెప్పించాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంత రెమ్యునరేష్ తీసుకున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో సంపూ స్పందిస్తూ.. గతం లో తాను హీరోగా చేసినప్పుడు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారో, ది ప్యారడైజ్ సినిమాకు అంతకు మూడు రెట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని అన్నాడు. గతంలో ఒక్కో సినిమాకు ఆయన కోటి రూపాయలు పైనే పారితోషికం తీసుకున్నట్టు టాక్. ఈ లెక్కన్న బర్నింగ్ స్టార్ ది ప్యారడైజ్ సినిమా కోసం 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది.

45
రెమ్యునరేషన్ - ఆస్తుల వివరాలు

సినిమా వర్గాల సమాచారం ప్రకారం, సంపూర్ణేష్ బాబు గతంలో ఒక సినిమా కోసం సుమారు50 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. తర్వాత కాలంలో అది కోటి రూపాయలు అయ్యిందట. ఆ కోటి రూపాయల రెమ్యునరేషన్ ది ప్యారడైజ్ సినిమాతో 3 కోట్లకు చేరినట్టు సమాచారం. పాత్ర నిడివి , ప్రాజెక్ట్ పరి పరిమాణాన్ని బట్టి ఈ రెమ్యునరేషన్ మారుతుంటుంది. ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ (Net Worth) సుమారు 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తన సంపాదనతో హైదరాబాద్‌లో సొంత ఇల్లు, ఖరీదైన కార్లతో పాటు సొంత ఊరిలో కొంత భూమిని కూడా కొన్నట్టు సమాచారం. ప్రారంభంలో అతి తక్కువ పారితోషికంతో కెరీర్ మొదలుపెట్టిన సంపూ, తనకంటూ ప్రత్యేక మార్కెట్ సృష్టించుకుని ఈ స్థాయికి ఎదగడం విశేషం.

55
ఉదార స్వభావం - సేవా కార్యక్రమాలు

సంపూర్ణేష్ బాబు ఎంత బిజీగా ఉన్నా.. సొంత ఊరిలో తనవారితో ఉండటానికే ఇష్టపడతాడు. హైదరాబాద్ లో షూటింగ్ హడావిడి అయిపోతే.. వెంటనే తన ఊరు సిద్దిపేటకు వెళ్లిపోతాడు. షూటింగ్స్ ఉంటేనే ఆయన హైదరాబాద్ లో ఉంటాడు. ఇక కేవలం వెండితెరపై నవ్వించడమే కాకుండా, నిజ జీవితంలోనూ తన ఉదారతతో అభిమానుల మనసు గెలుచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు లేదా కష్టాల్లో ఉన్నవారికి తన వంతుగా ఆర్థిక సాయం అందించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం, సింప్లిసిటీ సంపూర్ణేష్ బాబును సినీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. విలక్షణమైన పాత్రలతో అలరిస్తూ టాలీవుడ్‌‌లో తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories