Nagarjuna: చెయ్యి చూపిస్తే ట్రైన్ ఆగిపోవాలి, అంత కెపాసిటీ నాకు లేదు.. చిరు, బాలయ్య క్రేజ్ మ్యాచ్ చేయలేను

Published : Oct 02, 2026, 11:30 AM IST

చిరంజీవి, బాలకృష్ణ క్రేజ్ గురించి నాగార్జున ఊహించని కామెంట్స్ చేశారు. వాళ్ళ అంత కెపాసిటీ తనకు లేదని అన్నారు. అందుకే తాను వైవిధ్యమైన సినిమాలు ఎంచుకున్నట్లు నాగార్జున తెలిపారు.

PREV
15
Nagarjuna

టాలీవుడ్ లో చిరంజీవి, బలకృష్ణ విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. అంతటి క్రేజ్ సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. కానీ దశాబ్దాలుగా అదే క్రేజ్ ని ఈ ఇద్దరు హీరోలు కొనసాగిస్తూ వస్తున్నారు. గతంలో బాలయ్య, చిరంజీవి క్రేజ్ గురించి వారి ట్యాలెంట్ గురించి కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

25
చెయ్యి చూపిస్తే ట్రైన్ ఆగిపోవాలి

చిరంజీవి, బాలకృష్ణ లకు ఉన్న నైపుణ్యం గురించి నాగార్జున వివరించారు. చిరంజీవి గారు ఫెంటాస్టిక్ డ్యాన్సర్, ఫైటర్. ఆ బాడీ లాంగ్వేజ్ ఆయనకు ఉంది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయనకు మాస్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చెయ్యి చూపిస్తే ట్రైన్ ఆగిపోవాలి అంతే. అలా చేసినా ఆడియన్స్ క్లాప్స్ కొడతారు. దానిని నమ్మేలా చేయగలగడం.. ఆ స్టార్ డమ్ కి చేరుకోవడం అంత ఈజీ కాదు.

35
వాళ్లకు నాకు తేడా ఏంటి ?

కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా లాంటి డైలాగులు బాలయ్యకే సూట్ అవుతాయి. వాళ్ళకి నాకు తేడా ఏంటి అని నాకు నేను ప్రశ్న వేసుకున్నా. వాళ్ళ అంత క్రేజ్ దక్కించుకోవడానికి నేను ఏం చేయాలి ? వాళ్ళ లాగా మాస్ సినిమాలు చేయాలా ? నాకు అంత కెపాసిటీ లేదు.

45
నా బాడీ లాంగ్వేజ్ వేరు

ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ వేరు. వాళ్ళ లాగా నేను మాస్ సినిమాలు చేస్తే జనాలు నమ్మరు. కాబట్టి నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గ సినిమాలు ఎంచుకున్నాను అని నాగార్జున తెలిపారు. స్టైలిష్ గా ఉండే మాస్ సినిమాలు చేస్తూనే.. నాగార్జున రొమాంటిక్ మూవీస్, భక్తిరస చిత్రాలతో సూపర్ క్రేజ్ పొందారు.

55
వైవిధ్యమైన కథలు

వైవిధ్యమైన కథలు ఎంచుకోవడం వల్లే శివ, హలో బ్రదర్, అన్నమయ్య లాంటి అద్భుతమైన సినిమాలని నాగార్జున చేయగలిగారు. ప్రస్తుతం నాగార్జున తన 100వ చిత్రం కింగ్ 100లో నటిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories