శర్వానంద్, డింపుల్ హయతి భోగి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా క్లోజ్ గా కనిపించారు. వారి దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీని గురించి డైరెక్టర్ సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భోగి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి శర్వానంద్, డింపుల్ హయతి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య క్లోజ్ నెస్, కెమిస్ట్రీ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి వ్యవహార శైలి సినీ వర్గాల్లో కూడా ఆసక్తిగా మారింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన భోగి చిత్రం నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
24
శర్వానంద్, డింపుల్ కెమిస్ట్రీ
భోగి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్, డింపుల్ హయతి చాలా క్లోజ్ గా కనిపించారు. రెడ్ శారీలో డింపుల్ హయతి గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా శర్వానంద్, డింపుల్ చాలా దగ్గరయ్యారు. శర్వా భుజంపై డింపుల్ తలవాల్చే ప్రయత్నం చేసింది. ఇద్దరూ నవ్వుతూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు.
34
శర్వానంద్ పర్సనల్ లైఫ్ గురించి వార్తలు
ఈ దృశ్యాలే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ కి ఆల్రెడీ పెళ్ళై ఓ కుమార్తె కూడా ఉంది. అయితే ఆ మధ్యన శర్వానంద్ వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని వార్తలు ప్రచారం జరిగాయి. మరో వైపు డింపుల్ హయతి గురించి కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఆమె తన ప్రియుడితో సహజీవనం చేస్తోంది అని ఆయా మధ్యన ప్రచారం జరిగింది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అనేది క్లారిటీ లేదు.
డింపుల్, శర్వానంద్ క్లోజ్ నెస్ గురించి దర్శకుడు సంపత్ నంది తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమాలో వర్క్ చేసినప్పుడు హీరో హీరోయిన్లు క్లోజ్ గా ఉండడం అనేది చాలా సహజం. దాని గురించి ఏదో అనుకోవాల్సి అవసరం లేదు. వారి వీడియోల్ని ఎందుకు అలా వైరల్ చేస్తున్నారో తెలియడం లేదు అని సంపత్ నంది అన్నారు.