`బిగ్‌ బాస్`‌ షోకి ఎన్టీఆర్‌ మాజీ లవర్‌?.. ఈ సారి హౌజ్‌లో రచ్చ వేరే లెవల్‌.. కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే?

First Published | Aug 6, 2024, 1:57 PM IST

బిగ్‌ బాస్‌ షోకి ఈ సారి క్రేజీ కంటెస్టెంట్‌ని దించుతున్నారు. ఎన్టీఆర్‌ మాజీ లవర్‌ని షోలోకి తీసుకొస్తున్నారట. ఇదే ఇప్పుడు రచ్చ రచ్చ అవుతుంది. 
 

సమీరా రెడ్డి గ్లామర్‌ బాంబ్‌గా బాలీవుడ్‌ని ఊపేసింది. స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. అందాల విందులో నెక్ట్స్ లెవల్ షో చేసింది. ఇక తెలుగులోనూ ఈ అమ్మడు సినిమాలు చేసింది. ఎన్టీఆర్‌తో `నరసింహుడు`, `అశోక్‌` చిత్రాలు చేసింది. అలాగే మెగాస్టార్‌ చిరంజీవితో `జై చిరంజీవ` మూవీలో నటించింది. అయితే తారక్‌తో సినిమాలు చేసే సమయంలో ఆయనతో ప్రేమలో పడిందని, ఇద్దరు లవ్‌ చేసుకున్నారనే ప్రచారం జరిగింది. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. కానీ పెద్దలు ఇన్‌వాల్వ్ కావడంతో బ్యాక్‌ అయినట్టు సమాచారం.  
 

ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది సమీరా రెడ్డి. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్ గా ఉంది. తన పిల్లలతో వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు కామెడీ వీడియోలు చేస్తూ అలరిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. అయితే ఇటీవల తాను మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపింది సమీరా రెడ్డి. ఈ నేపథ్యంలో ఆమె బిగ్ బాస్‌ కి వెళ్లి దాని ద్వారా మేకర్స్ కి సందేశం ఇవ్వాలని అలా మళ్లీ సినిమాల్లోకి రావాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 
 


సమీరా రెడ్డి బిగ్‌ బాస్‌ కి రావడం కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తుంది. అయితే ఆమె వచ్చేది తెలుగు బిగ్‌ బాస్‌లోకి కాదు, హిందీ బిగ్‌ బాస్‌కి అని టాక్. `బిగ్‌ బాస్‌` షో ఇండియాలోనే మోస్ట్ పాపులర్‌ రియాలిటీ షోగా నిలిచింది. హిందీలో ప్రారంభమైన ఈ షో నెమ్మదిగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంకి విస్తరించింది. త్వరలో సెప్టెంబర్‌లో తెలుగులో `బిగ్ బాస్‌ తెలుగు సీజన్‌ 8` ప్రారంభం కాబోతుంది. అలాగే హిందీలో 18వ సీజన్‌ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 

సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్ గా ఈ హిందీ `బిగ్‌ బాస్‌` షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. మధ్యలో రెండు మూడు సీజన్లకి తప్పితే, దాదాపు అన్ని సీజన్లకి సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్ గా చేస్తున్నాడు. ఆద్యంతం అలరిస్తున్నారు. సినిమాల పరంగా డిజప్పాయింట్‌ చేసినా, ఈ బిగ్‌ బాస్‌ షో విషయంలో మాత్రం ఆయన డిజప్పాయింట్‌ చేయడం లేదు. అదే జోరు చూపిస్తున్నారు. అంతే క్రేజీగా హోస్ట్ గా చేస్తూ ఆకట్టుకుంటున్నారు. బిగ్‌ బాస్‌ 18 సీజన్‌ సెప్టెంబర్‌ ఎండింగ్‌లోగానీ, అక్టోబర్‌ ప్రారంభంలోగానీ స్టార్ట్ కానుందట. కలర్‌ టీవీ, జీయో సినిమాలు లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

 `బిగ్‌ బాస్‌ 18`కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్లు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్ల వివరాలు క్రేజీగా మారాయి. అందులో భాగంగా సంచలన హీరోయిన్‌ పేరు తెరపైకి రావడం విశేషం. ఈ లేటెస్ట్ సీజన్‌లోకి కంటెస్టెంట్ గా సమీరా రెడ్డి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే ఆమెని బిగ్‌ బాస్‌ నిర్వహకులు అప్రోచ్‌ అయ్యారని, అందుకు ఈ మాజీ హీరోయిన్‌ ఓకే చెప్పిందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. సమీరా రెడ్డి.. ఎన్టీఆర్‌ మాజీ లవర్ అనే విషయం తెలిసిందే. 

ప్రస్తుతం వినిస్తున్న సమాచారం మేరకు కొందరు కంటెస్టెంట్లు ఫైనల్‌ అయ్యారట. వారిలో షోయబ్‌ ఇబ్రహీం, సమీరా రెడ్డి, కశిష్‌ కపూర్, జయన్‌ సైఫీ, పూజా శర్మ, రేఖా, డాలీచాయ్‌ వాలా, దిగ్విజయ్‌ సింగ్‌ రాథీ, ఫైసెల షేక్‌, ఫుక్రా ఇన్సాన్‌, షీజన్‌ ఖాన్‌, దాల్జీత్ కౌర్‌, దీపికా ఆర్య, నుస్రత్‌ జహన్‌, అలైస్‌ కౌశిక, హర్ష్‌ జ్యోతీ, కరణ్‌ పటెల్‌, సోమీ అలీ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ లిస్ట్ ఫైనల్‌ అని అంటున్నారు.  

Latest Videos

click me!