బరువు ఎక్కువైంది అంటూ ఎన్టీఆర్ హీరోయిన్ పై ట్రోలింగ్.. లేటెస్ట్ ఫోటోస్ తో దిమ్మతిరిగే షాక్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 13, 2022, 10:06 AM IST

అందాల భామ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.    

PREV
17
బరువు ఎక్కువైంది అంటూ ఎన్టీఆర్ హీరోయిన్ పై ట్రోలింగ్.. లేటెస్ట్ ఫోటోస్ తో దిమ్మతిరిగే షాక్

అందాల భామ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.  

 

27

తెలుగులో నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. సినిమాలు సక్సెస్ కాలేదు. కానీ ఎన్టీఆర్, సమీరా రెడ్డి గురించి అప్పట్లో చాలా గాసిప్స్ వచ్చాయి. 

 

37

సమీరా రెడ్డి మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవా చిత్రంలో గ్లామర్ ఒలకబోసింది. సమీరా రెడ్డి వెండి తెరపై బాగానే అందాలు ఆరబోసింది. అందుకే యువతలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. హీరోలతో సమానంగా డాన్స్ చేయగల నటి సమీరా రెడ్డి.  

 

47

ఇక సమీరా రెడ్డి వివాహం తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ అక్షయ్ వర్దెని సమీరా రెడ్డి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. గర్భంతో ఉన్న సమయంలో మహిళలు కాన్ఫిడెంట్ గా ఉండాలంటూ సమీరా రెడ్డి బికినిలో సాహసోపేతంగా అండర్ వాటర్ ఫోటోషూట్స్ తో హాట్ టాపిక్ గా నిలిచింది. కాన్పు తర్వాత కూడా సమీరా రెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. 

 

57

డెలివరీ తర్వాత మహిళలు బరువు పెరగడం సహజం. వారి శరీరంలో మార్పుల వల్ల బరువు పెరుగుతారు. సమీరా రెడ్డి రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. డెలివరీ తర్వాత తన బరువు 92 కేజీలు ఉన్నట్లు పేర్కొంది. దీనితో కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. సమీరా రెడ్డి ఓవర్ వెయిట్ అయిందని కూడా అన్నారు. 

 

67

కానీ అలాంటి కామెంట్స్ విన్నప్పుడు మహిళలు ఎవరూ సిగ్గుగా ఫీల్ కాకూడదు. నేను ఆ కామెంట్స్ పెట్టించుకోలేదు. సీరియస్ గా ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాను. ఎంతో శ్రమించాను. ఇప్పుడు నా బరువు 81 కేజీలు. 11 కేజీలు తగ్గాను అని సమీరా పేర్కొంది. ఇంకా ఫిట్ నెస్ వర్క్ కంటిన్యూ చేస్తున్నాను అని సమీరా తెలిపింది. 

 

77

ప్రస్తుతం సమీరా రెడ్డి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఫ్యామిలీతో, భర్తతో సంతోషంగా ఉన్న మూమెంట్స్ ని సమీరా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. వెకేషన్స్ లో బికినిలో తన భర్తతో ఉన్న ఫొటోస్ ని కూడా సమీరా గతంలో పంచుకుంది. 

click me!

Recommended Stories