Samantha: ఒక్కసారికే పాన్‌ ఇండియా మొత్తం ఊగిపోయింది..ఇంకో సాంగంటే షేక్‌ షేకైపోవాల్సిందే?

Published : Jul 17, 2022, 06:59 AM IST

సమంత ఒక్కసారి ఐటెమ్‌ సాంగ్‌ చేస్తేనే ఇండియా మొత్తం ఊగిపోయింది. ఇప్పటికీ అదే అంతా అదే దాన్నే కలవరిస్తున్నారు. ఇప్పుడు మరో సాంగ్‌ చేయబోతుందట సామ్‌. ఇక పూనకాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.   

PREV
17
Samantha: ఒక్కసారికే పాన్‌ ఇండియా మొత్తం ఊగిపోయింది..ఇంకో సాంగంటే షేక్‌ షేకైపోవాల్సిందే?

సమంత.. ఐటెమ్ సాంగ్‌లో ఓ నయా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. హీరోయిన్లు ఐటెమ్ సాంగ్‌చేయడమనేది కొత్తేమి కాదు. అంతకు ముందు చాలా మంది స్టార్‌ హీరోయిన్లు ఐటెమ్ సాంగ్‌లు చేశారు. వెండితెరపై రచ్చచేశారు. సినిమాలకే హైలైట్‌గా నిలిచాయి ఆయా స్పెషల్‌ సాంగ్‌లు. కానీ సమంత చేసిన స్పెషల్‌ సాంగ్‌మాత్రం చాలా స్పెషల్‌. దానికి పాన్‌ ఇండియా ఇమేజ్‌ రావడం విశేషం.

27

సమంత ఫస్ట్ టైమ్‌ `పుష్ప`లో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. `ఊ అంటావా..ఊఊ అంటావా ` అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో ఊరమాస్‌ లుక్‌లో, యమా హాట్ గా రెడీ అయి మాస్‌ స్టెప్పులేసింది సమంత. తనకెరీర్లోనే అత్యంత ఊరమాస్‌ సాంగ్‌ ఇదే. అంతేకాదు స్పెషల్‌ సాంగ్‌ల్లోనే ఇది ఊరమాస్‌ సాంగ్‌ కావడం విశేషం. `పుష్ప` పాన్‌ ఇండియాచిత్రంగా విడుదల కావడంతో ఈ పాటకి పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది. 
 

37

జనరల్‌గా ఇప్పటి వరకు ఏ పాన్ ఇండియా సినిమాలోనూ ఐటెమ్‌ సాంగ్‌కి ఈ రేంజ్‌ గుర్తింపు దక్కలేదు. ఈ ఒక్క పాటతోనే సమంతకి పాన్‌ ఇండియా గుర్తింపు రావడం విశేషం. నార్త్  టూ సౌత్‌ ఆడియెన్స్ నుంచి సెలబ్రిటీల వరకు సమంత ఐటెమ్‌సాంగ్‌నే జపం చేస్తున్నారు. మీకు నచ్చినపాట ఏంటని అడిగితే `ఊ అంటావా మామ.. `అంటున్నారు. ఇటీవల ముంబయిలో ఓ ఈవెంట్‌ సల్మాన్‌ ఖాన్ ని ఈప్రశ్న అడగ్గా ఆయన `ఊ అంటావా..` అని పాడుకుంటూ వెళ్లడం విశేషం. సమంత పాటకి దక్కిన క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 
 

47

సమంత జస్ట్ ఒక్క ఐటెమ్‌ సాంగ్‌తోనే, అది కూడా తన తొలి స్పెషల్‌ సాంగ్‌తోనే ఏకంగా ఇండియనే షేక్‌ చేసేసింది. అలాంటిది ఆమె మరోసారి స్పెషల్‌ సాంగ్‌ చేస్తే ఆ పాటపై ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు. మరో మరోస్థాయిలోనూ ఉంటుందని చెప్పొచ్చు. నిజానికి `పుష్ప 2`లోనూ సమంతతో మరో ఐటెమ్‌ సాంగ్‌ చేయించాలని సుకుమార్‌ భావిస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ తర్వాత బాలీవుడ్‌ భామని రంగంలోకి దించినట్టు తెలిసింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

57

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేయబోతుందట. అది ఎవరి సినిమానో కాదు, సమంత మెయిన్‌ లీడ్‌గా నటిస్తున్న సినిమానే కావడం విశేషం. ప్రస్తుతం సామ్‌ నటిస్తున్న చిత్రాల్లో `యశోద` ఒకటి. ఆమె నటిస్తున్న తొలి పాన్‌ ఇండియామూవీ ఇది. ఒక్క సాంగ్ మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. 
 

67

`యశోద` చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌ని డిజైన్‌ చేశారట. దాన్ని సమంత చేతే చేయించాలని భావిస్తుందట యూనిట్‌. ఇందులో మిగిలిన ఒక్క సాంగ్‌ని ఐటెమ్‌ సాంగ్‌గా మలచబోతున్నారట. అయితే దాన్ని `ఊ అంటావా ఊఊ అంటావా` ని మించి ఉండేలా ప్లాన్‌ చేస్తుందట యూనిట్. కనీవిని ఎరుగని రీతిలో ఆ స్పెషల్‌ సాంగ్‌ ఉండాలని భావిస్తున్నారట. ఆ పాట క్లిక్‌ అయితే ఆ క్రేజ్‌ ఇండియా దాటి ఉంటుందని చెబుతుంది యూనిట్‌. మరి ఆ పాట ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. 

77

హరి శంకర్‌,హారీష్‌ నారాయణ్‌ దర్శకత్వ ద్వయం రూపొందిస్తున్న చిత్రమిది. సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. దీనికి జర్నలిస్ట్ లు పులగం చిన్నారాయణ,చల్లా భాగ్యలక్ష్మి డైలాగ్లు రాయడం విశేషం. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈచిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories