పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్స్ చాలా తక్కువ. సత్యశ్రీ, వర్ష, రోహిణి లాంటి అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వీరితో పాటు రీతూ చౌదరి జబర్దస్త్ కి రావడం జరిగింది. ఎక్కువగా హైపర్ ఆది స్కిట్స్ లో నటించిన రీతూ పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది.
తెలుగమ్మాయి అయిన రీతూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆమె కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించారు. అయినప్పటికీ ఆమెను అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.
24
Jabardasth Rithu Chowdary
జబర్దస్త్ కి వచ్చాక రీతూకి కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆరు లక్షలు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి.
34
Jabardasth Rithu Chowdary
సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తన వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో రీతూ కాబోయేవాడిని పరిచయం చేసింది. నీ బంధం కంటే విలువైనది ఏదీ లేదంటు కామెంట్ చేసిన రీతూ కాబోయే భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేసింది.
44
Jabardasth Rithu Chowdary
ఇక రీతూ చౌదరిని పెళ్లాడబోయే ఆ వ్యక్తి పేరు శ్రీకాంత్ అని సమాచారం. ఇతడు రాజకీయ నేపథ్యం కలిగినవాడని ప్రచారం జరుగుతుంది. కొన్నాళ్లుగా రీతూ ,శ్రీకాంత్ ప్రేమించుకుంటున్నారట. అయితే పెళ్లి ఎప్పుడనే విషయంపై రీతూ క్లారిటీ ఇవ్వలేదు. రీతూకి పెళ్ళని తెలుసుకున్న ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.