సమంత - నాగ చైతన్య కలవబోతున్నారా? సామ్ అలా చేయడంతో.. మళ్లీ మొదలు..

First Published | Sep 20, 2023, 5:35 PM IST

సమంత -నాగచైతన్య కలవబోతున్నారా? సమంత ఆ పోస్టును అన్ ఆర్కైవ్ చేసింది అందుకేనా? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని నెటిజన్లు కూడా అవునంటున్నారు. ఇంతకీ సామ్ ఏం చేసిందంటే.. 
 

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) - అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)  విడిపోయి రెండేళ్లు దాటిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వీళ్లు ఎందుకు డివోర్స్ తీసుకున్నారనే దానిపై స్పష్టమైన కారణం ఎవరికీ తెలియదు. ఈ లోపే అప్పుడప్పుడు మళ్లీ కలవబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. 
 

ఇక సమంత - చైతూ 2017, అక్టోబర్ 6న హిందూ   సాంప్రదాయ ఆచారాల ప్రకారం, ఆ మరుసటి రోజు క్రైస్తవ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. దీంతో అక్కినేని కుటుంబంలో సభ్యురాలిగా మారిపోయింది. ఆ తర్వాత తన పేరును సోషల్ మీడియా సమంతా  అక్కినేని అని మార్చుకుంది.
 


అలాగే ఇన్ స్టా వేదికన తన వెడ్డింగ్ పిక్స్ ను కూడా పోస్ట్ చేసింది. ఉన్నట్టుండి 2021 జూలై 31న ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి ఇంటిపేరు ‘అక్కినేని’ని తొలగించింది. ఆ కొద్దిరోజులకే వారు విడిపోతున్నట్టు కూడా ప్రకటించారు. అప్పట్లో వీరి డివోర్స్ సెన్సేషనల్ గా మారింది. దాంతో సామ్ చైతూ ఫొటోలన్నీంటిని తొలగించింది.
 

అసలు సామ్, చైతూ ఎందుకు వీడిపోయారనేది ఎవరికీ తెలియదు. అప్పటికే టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా మారిన వీరు డివోర్స్ తీసుకోవడం ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోయారు. మళ్లీ కలిస్తే బాగుండు అని సోషల్ మీడియా వేదికన ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు వెల్లడిస్తూనే వస్తున్నారు. 
 

సామ్ తో విడిపోయాకా చైతూ మరో పెళ్లికి సిద్ధమయ్యాడని, నటి శోభితా దూళిపాళతో ఆయన డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. వీటన్నింటనీ ఎప్పటికప్పుడు చైతూ కొట్టిపారేస్తూ వచ్చారు. శోభితా కూడా ఖండిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా సామ్, చైతూ కలిసిపోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం కూడా ఉంది.
 

సమంత తన ఇన్ స్టాలో 2017లోని వెడ్డింగ్ ఫొటోను తాజాగా అన్ ఆర్కైవ్ చేసింది. తిరిగి ఆ ఫొటోలను తీసుకోవడంతో మళ్లీ కలుస్తారా? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు, ఫ్యాన్స్ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సమంత నెమ్మదిగా నాగ చైతన్యతో ఉన్న తన పోస్ట్‌లన్నింటినీ అన్‌ఆర్కైవ్ చేస్తోందని అంటున్నారు. 
 

ప్రస్తుతం నాగచైతన్య కూడా రెండో పెళ్లికి సిద్ధంగా లేరని, అటు సమంత లైఫ్ లోకి రెండేళ్లు దాటినా ఇంకెవరూ రాకపోవడంతో మళ్లీ కలుస్తారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. రీసెంట్ గా బిగ్ బాస్ 7లోనూ అక్కినేని నాగార్జున సమంత గురించి ప్రత్యేకంగా అడగటం, పైగా ఆమెను అభినందిండం విశేషం. 

ఇదిలా ఉంటే మరికొందరూ అలాంటిదేమీ లేదంటున్నారు. ఎక్కువ శాతం త్వరలో సామ్, చై కలుస్తారని బలంగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో ఏం జరుగుతుందన్న ఇంకాస్తా సమయం గడిస్తే గానీ చెప్పడం కష్టమనేది అర్థం అవుతోంది. చివరిగా సామ్ ‘ఖుషీ’తో అలరించింది. చై ‘కస్టడీ’తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం NC23పై ఫోకస్ పెట్టారు. 

Latest Videos

click me!