సమంత `బిగ్‌బాస్4` గెస్ట్ హోస్ట్ గా మెరిసిన విషయం తెలిసిందే. నాగార్జున `వైల్డ్ డాగ్` షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లడంతో ఆయన స్థానంలో సమంత వ్యాఖ్యాతగా మెరిశారు. నిజంగా శనివారం కూడా ఆమె రావాల్సింది కాదే, హోస్ట్ లేకుండానే లాగించారు. ఇక ఆదివారం హోస్ట్ గా మెరిసింది సమంత. దసరా స్పెషల్ ఈవెంట్‌తో తొలిసారి హ్యాండిల్ చేసింది.
నాగార్జున మూడు వారాలపాటు హిమాలయాల్లో ఉండాల్సి వస్తుంది. మూడు వారాలు అంటే ఆరు రోజులు ఆయన లేకుండా `బిగ్‌బాస్ 4` షో సాగుతుంది. దీంతో సమంతని హోస్ట్ గా రంగంలోకి దించారు.
ఆమె ఐదు రోజుల పాటు రానుంది. శనివారం ఆమె లేకుండానే జరిగింది. అయితే ఈ ఐదు రోజులకు సమంత ఏకంగా రెండు కోట్ల పది లక్షలు పారితోషికంగా తీసుకుంటుందట.
నాగార్జున మొత్తం బిగ్‌బాస్4 సీజన్‌కి ఎనిమిది కోట్లు అందుకుంటున్నారు. కానీ సమంత కేవలం ఐదు రోజులకే ఇంత మొత్తాన్ని తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇక ఫస్ట్ టైమ్ హోస్ట్ గా ఎంట్రీతోనే మహాఎపిసోడ్‌ని డీల్ చేసి మెప్పించింది సమంత. ఆమెకి ఆడియెన్స్ మంచి మార్కులే వేశారని తెలుస్తుంది.
లాక్‌డౌన్ సమయంలో సమంత ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేయని సమంత త్వరలో `ఫ్యామిలీ మేన్-2` వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు సోషల్ మీడియా భారీ ఫాలోయింగ్‌తో దూసుకుపోతుంది సమంత. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య తాజాగా కోటీ ముప్పై లక్షల మంది దాటారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. తన అభిమానులకు, ఫాలోవర్స్ కి ధన్యవాదాలు తెలిపింది.